తెలంగాణ

సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసుల క్రమబద్ధీకరణపై హైకోర్టు శనివారం రాష్ట్రప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. నక్కా గోవింద్‌రెడ్డి మరో 23 మంది ఉస్మానియా వర్శిటీ విద్యార్ధులు కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్ రావుతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 26న జీవో 16 జారీచేసిందని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు ఈ జీవో జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపి రాష్ట్రంలో ఉన్న నియామకాల క్రమబద్ధీకరణ చట్టాన్ని రాష్ట్రానికి ఉపయోగించుకుంటూనే 10 ఏ అనే కొత్త సెక్షన్‌ను కలిపారన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సవరణ చేయరాదన్నారు. శాసనసభ ద్వారానే చట్టాలను ఆమోదించి అమలు చేయాలన్నారు.