తెలంగాణ

నకిరేకల్, జడ్చర్లలో టిఆర్‌ఎస్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాయతీ ఎన్నికల్లో తగ్గిన స్థానాలు
నల్లగొండ జిల్లాలో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం
జడ్చర్ల మేజర్ పంచాయతీలో మంత్రి లక్ష్మారెడ్డికి ఎదురుదెబ్బ
నకిరేకల్‌లో ప్రజాఫ్రంట్ గెలుపు
జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

మహబూబ్‌నగర్/నల్లగొండ, నవం బర్ 5: మహబూబ్‌నగర్, నల్ల గొండ జిల్లాల్లో శనివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. ఈ రెం డు జిల్లాల్లో మెజారిటీ స్థానాలను టిఆర్‌ఎస్ కైవశం చేసుకున్నప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, నల్లగొండ జిల్లాలో నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ రెండు మేజ ర్ పంచాయతీల్లో ఒకటైన జడ్చర్లలో ఆ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ సైతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. అదేవిధం గా నకిరేకల్ పంచాయతీలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఇక్కడ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిం చినప్పటికీ ఫలితం లేకుండా పో యంది. దీంతో రెండు జిల్లాల్లో రెండు మేజర్ గ్రామ పంచాయతీల్లో టిఆర్ ఎస్‌కు ఎదురుదెబ్బ తగ లడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతు న్నాయ. నల్లగొండ జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ అతికష్టంగా ఐదు సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించింది. నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీ సహా నాలుగు సర్పంచ్ స్థానాల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందారు. నకిరేకల్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్(కాంగ్రెస్, టిడి పి, వామపక్షాలు, బిజెపి, వైఎస్సార్‌సిపి, టియువి కూటమి) అభ్యర్థి పన్నాల రంగమ్మ 440ఓట్లతో టిఆర్‌ఎస్ బలపరిచిన సామా మంగమ్మపై విజయం సాధించింది. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని అమ్మనబోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన శీలం స్వరూప 178ఓట్లతో టిఆర్‌ఎస్‌కు చెందిన బబ్బూరి కవితపై గెలుపొందింది. స్వయంగా సునీత ప్రచారం నిర్వహించినా ఇక్కడ టిఆర్‌ఎస్ తన సిట్టింగ్ సర్పంచ్ స్థానం కో ల్పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బుక్కా వెంకటేష్ ఘన విజయం సాధించారు.