తెలంగాణ

వైష్ణవ ఆలయాల్లో తొలి ఏకాదశి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తొలి ఏకాదశి సందర్భంగా శుక్రవారం నాడు ఎపి, తెలంగాణల్లోని వైష్ణవ దేవాలయాల్లో భక్తుల కోలాహలం మిన్నంటింది. ఈ రోజంతా ఉపవాసం చేసి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తజనుల ప్రగాఢ విశ్వాసం. తిరుపతి, భద్రాచలం, యాదగిరి గుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. తొలి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు పాలకడలిపై నిద్రిస్తాడని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పెద్దలు చెబుతుంటారు. శయన ఏకాదశిగా పిలిచే తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ.