తెలంగాణ

బడ్జెట్ సమావేశాల్లోగా విలీనం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో మంగళవారం సాయంత్రం నారాయణపేట టిడిపి ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అధికారికంగా టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాజేందర్‌రెడ్డిని ముఖ్యమంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, వివేకానందాగౌడ్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. టిడిపికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరినట్టు స్పీకర్‌కు అందించిన లేఖపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరించినట్టు తెలిసింది. ఈ మేరకు టిడిపిఎల్‌పి తరఫున అధికారికంగా స్పీకర్‌కు లేఖ అందించినట్టు వారు వివరించారు. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు వారు వివరించారు. శాసనసభా బడ్జెట్ సమావేశాల్లోనే తమ టిడిఎల్‌పి విలీనం ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా చూడాల్సిందిగా వారు ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిసింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో భారీ బహిరంగ నిర్వహించి ఆ వేదికపై తాము ఎందుకు టిఆర్‌ఎస్‌లో చేరింది ప్రజలకు వివరించనున్నట్టు వారు తెలిపారు. బహిరంగ సభ నిర్వహించడానికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఇలా ఉండగా తాను అధికారికంగా టిఆర్‌ఎస్‌లో చేరినట్టు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రకటించారు.

కాలిఫోర్నియాకు రండి
నరసింహస్వామి కల్యాణానికి
సిఎంను ఆహ్వానించిన నిర్వాహకులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కాలిఫోర్నియాకు చెందిన సిద్ధి వినాయక కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆర్ ఉమాశంకర్ దీక్షిత్, సిఫి డాట్ కామ్ డైరెక్టర్ ఆనందరాజు ఆహ్వానించారు. ఈమేరకు వీరిద్దరూ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిశారు. వచ్చే నెల మార్చి 17వ తేదీన లక్ష్మి నర్సింహ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు యాదగిరిగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లో యుకె వీసా సెంటర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ నగరంలో ఆధునీకరించిన యుకె, ఐర్లాండ్ నూతన వీసా అప్లికేషన్ సెంటర్(విఎసి)ను మంగళవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. భారత దేశం నుంచి యుకె వెళ్లే వారికి ఇప్పుడు గతంలో కన్నా 17 శాతం ఎక్కువగా వీసాలు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో శ్రీడే అనుష్క ప్రైడ్ లో 8-2-700లో మూడవ అంతస్తులో తమ కార్యాలయం పని చేస్తుందని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పని చేస్తుందని తెలిపారు.
రక్షణ కల్పించండి
హైకోర్టుకు మత్తయ్య వినతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఓటుకు నోటు కేసులో నాలుగవ ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్యను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశించినప్పటికీ ఎసిబి తనను అరెస్టు చేసే యోచనలో ఉందని మత్తయ్య హైకోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తన అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, ఎసిబి కావాలని నోటీసులు జారీ చేసిందని ఆయన హైకోర్టు న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. తాను దళిత క్రైస్తవుడననే అరెస్టు చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తనకు పూర్తి రక్షణ కల్పించాలని కూడా ఆయన న్యాయమూర్తిని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌పై కోర్టు ధిక్కారణ కేసు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తన కేసులో ఉచిత న్యాయ సహాయం అందించాలని, అవసరమైన మేరకు సిఫార్సు చేయాలని మత్తయ్య కోరారు.