తెలంగాణ

పిడిఎస్ ద్వారా చిరుధాన్యాలకు చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్)ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలకు బదులు చిరుధాన్యాలను అందించాలని చట్టంలో మార్పులు తీసుకువచ్చామని సుప్రీంకోర్టు ఫుడ్ కమిషన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ బిరాజ్ పట్నాయక్ అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నెలరోజుల కిందట ప్రారంభమైన పాతపంటల జాతర శనివారం ముగిసింది. సభనుద్దేశించి బిరాజ్ పట్నాయక్ మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాల్లో చిరుధాన్య వంటకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 12 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలల్లో ఉండగా 13 కోట్ల మంది అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్నారన్నారు. దీంతో చిరుధాన్యాలకు మార్కెట్ లభ్యమవుతుందన్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగితే 60 సంవత్సరాల కిందట భారతదేశంలో లభించే ఆహారం లభిస్తుందన్నారు. డిడిఎస్ డైరెక్టర్ పివి.సతీష్ మాట్లాడుతూ పౌష్టిక విలువులు అపారంగా ఉన్న చిరుధాన్య పంటలైన కొర్ర, సజ్జ, సామ, జొన్న తదితర పంటల సాగును ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, రేషన్ కార్డుద్వారా ప్రజలకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో సైతం స్థానిక చిరుధాన్య రైతులు ఎకరంలో 15 రకాల పంటలను పండించి జీవవైవిధ్యాన్ని కాపాడుతూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఏ ఒక్కరికీ నష్టం రాలేదని, ఆత్మహత్యలు చేసుకోలేదని స్పష్టంచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ చిరుధాన్యాల నిపుణుడు రాబర్డ్‌బ్రాక్‌డేలా పెరిరా మాట్లాడుతూ చిరుధాన్యాలు తమ దేశంల కూడా పండిస్తామని కానీ ఈ ప్రాంతంలో ఉన్నన్ని రకాలు కలిపి పండించమన్నారు. ఆఫ్రికాలో రైతులు జీవవైవిధ్య పరిరక్షణకోసం చేస్తున్న కృషిని వివరించారు. చిరుధాన్యాలపై తమ దేశంలో సినిమా తీస్తున్నామని, అదే పనిమీద ఇక్కడికి వచ్చామన్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆహారవ్యవస్థ నిపుణులు రెనె సలాజార్ మాట్లాడుతూ మీరే (డిడిఎస్ సంఘాల రైతులు) నిజమైన జీవవైవిధ్య రక్షకులన్నారు. భారతదేశంలో 17వేల రకాల వరి, మామిడి రకాలుండేవన్నారు. ఇవన్నీ శాస్తవ్రేత్తలిచ్చిన రకాలు కావని రైతులిచ్చినవేనన్నారు. నాగాలాండ్ నార్త్‌ఈస్ట్ నెట్‌వర్క్స్ కోఆర్టినేటర్ సెనోసుహా మాట్లాడుతూ డిడిఎస్ మహిళా సభ్యులు నిర్వహిస్తున్న పంటల జాతరకు దేశవిదేశాలనుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీలో గెలుపొందిన మంజీరా ఉన్నత పాఠశాల జహీరాబాద్, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల కుప్పానగర్ విద్యార్థులకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు.

సభలో మాట్లాడుతున్న బిరాజ్ పట్నాయక్