తెలంగాణ

కెసిఆర్‌ది కుటుంబ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌తో ఆలింగనం చేసుకోవడం, తెలంగాణలో బిజెపి చంద్రబాబుతో ములాఖత్ కావడం ప్రజలను నిలువునా మోసం చేయడమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కేంద్రంలో మోదీ, ఆంధ్ర సిఎం, తెలంగాణ సిఎంలను నమ్మవద్దని, వారి మాటలకు మోసపోవద్దని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పిడికిలి నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని, బంగారు తెంలగాణ అంటే కెసిఆర్ కుటుంబం బాగుపడడం కాదని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజధానిలో సనత్‌నగర్, బేగంపేట, ఎల్‌బినగర్, చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెరాస ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌ను సిఎంని చేస్తే ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి వేరే కుంపటి పెట్టాడని దుయ్యబట్టారు. కెసిఆర్ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 2019 ఎన్నికల్లో తెరాసను ఓడించే ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని, తెదేపా, భాజపాకు ఓటేస్తే తెరాసకు వేసినట్లేనన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరు తిట్టుకొని ఇప్పుడు కలిసిపోయి పొగడ్తలు గుప్పించుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలను నిలువునా మోసం చేస్తున్న కెసిఆర్‌కు ఓటుద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కెసిఆర్ తానే చేస్తున్నాననడం సిగ్గుచేటన్నారు. టీ ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన 18 మాసాల్లో కెసిఆర్ చేసిందేమిటంటే గులాబీ హోర్డింగ్‌లు, కండువాలు కప్పడమే చేశారన్నారు. కెసిఆర్ తెలంగాణ తన జాగీరుగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యుల పాలన చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ అబద్ధాల మాటకారి అని, ప్రతిపక్షం లేకుండా కుట్ర పన్నుతున్నారని ఆయన దుయ్యబట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో, బిజెపి, టిడిపికి ఓటు వేస్తే అది వృథా అవుతుందని, గెలిచిన వెంటనే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి లిస్టును బుధవారంలోపు పంపించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షునికి సూచించారు. ఈ నెల 14న తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. కేసీఆర్ అధికారంలోకి రాక ముందు ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు పలికి, నేటికీ ఆ మాట ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. టిఆర్‌ఎస్, భాజపా, టిడిపి పార్టీలు ప్రజలను ఎలా మోసగిస్తూ మభ్యపెడుతున్నది సీడీల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశీలకులు రాంచందర్ కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత్‌రావు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, షబ్బీర్ అలీ, ఫారూఖ్‌అలీ, చంద్రశేఖర్, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
chitram...
గ్రేటర్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచార సభలో మాట్లాడుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్