తెలంగాణ

గెలవకుంటే రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని తెరాస సాధించకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తెరాస గెలిస్తే కాంగ్రెస్, బిజెపి, తెదేపా నేతలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తారా? అని ఐటి మంత్రి కె తారక రామారావు సవాల్ చేశారు. గ్రేటర్‌లో తెరాస వంద స్థానాల్లో విజయం సాధిస్తుంది. మేయర్ పీఠంపై తెరాస అభ్యర్థి ఉంటారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస మొదటిస్థానంలో, ఎంఐఎం రెండో స్థానంలో బిజెపి మూడో స్థానం, తెదేపా నాల్గవ స్థానంలో, కాంగ్రెస్ ఐదో స్థానంలో ఉంటుందని కెటిఆర్ జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్నాం కాబట్టి అమలకు సాధ్యమయ్యే హామీలనే ఇస్తామని, ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేని పార్టీలు ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చని, విపక్షాలు చందమామను నేలపైకి తెస్తామనే హామీ సైతం ఇస్తాయని ఎద్దేవా చేశారు. మెట్రో రైలును దశల వారీగా 200 కిలోమీటర్లకు విస్తరించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. తెరాసకు ఓటు వేయకుండా ఉండడానికి ఒక్క కారణం కూడా లేదని, అదేవిధంగా విపక్షాలు ఓటు అడిగేందుకు ఒక్క కారణం లేదన్నారు. రాజధాని నగరంలో మంచి రోడ్లు, తాగునీరు, భద్రత కల్పించనున్నట్టు చెప్పారు. 25వేల కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జనాభా కోటికి చేరుకుందని, ఇతర ప్రాంతాల నుంచి రోజూ వచ్చి పోయే వారు 20 లక్షల మంది వరకూ ఉంటారన్నారు. బిజెపి మతం పేరిట విషం చిమ్మి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. రామ మందిరం నిర్మిస్తామని ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చిన వారు హిందువులకు ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణ హామీ జోకా? అని ప్రశ్నించారు. తెరాస అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాల వారిని పంపిస్తారని విష ప్రచారం చేశారని, 18నెలల పాలనలో ఏవిధంగా తెరాస వ్యవహరించిందో ప్రజలు చూశారన్నారు. రాష్ట్రంలోని 30శాతం జనాభా హైదరాబాద్‌లోనే ఉంటుందని, సమైక్యాంధ్రకు ఆర్థిక శక్తిగా నిలిచిన హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సైతం అదేవిధంగా నిలుస్తుందన్నారు.
విభజనతో ఆంధ్రకు ప్రయోజనమే
విభజన జరిగితే రెండు ప్రాంతాలకు మేలు కలుగుతుందని ఉద్యమ సమయంలో తాము చెప్పిన మాటలు ఇప్పుడు నిజమని తేలాయన్నారు. విభజన కాకుంటే నవ్యాంధ్రకు అమరావతి వంటి రాజధాని నిర్మాణానికి అవకాశం ఉండేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రలో అనేక విద్యాసంస్థలు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తున్నాయని,అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయని, రాష్ట్ర విభజన జరిగి ఉండక పోతే ఇవి జరిగేవా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ దాహార్తి తీర్చడానికి గోదావరి నుంచి నీటిని తరలించే పథకం నత్తనడక నడుస్తుంటే సిఎం పర్యవేక్షణతో పూర్తి చేయగలిగామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి స్పష్టమైన విధానాలతో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. మూసి నది చుట్టూ 42 కిలోమీటర్ల పరిధిలో నాలుగు లైన్ల రహదారి నిర్మించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికే గ్రేటర్ పీఠం అప్పగించడం ద్వారా అభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం మెట్రో 72 కిలోమీటర్ల వరకు ఉందని, రెండో విడత 83 కిలోమీటర్లు విస్తరించనున్నట్టు చెప్పారు. మూడో విడత మరో 43 కిలోమీటర్లు విస్తరించనున్నట్టు చెప్పారు. మొత్తం 200 కిలో మీటర్ల పరిధిలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
పార్టీనే ఉండదనుకున్నాం
తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్‌లో విలీనమనే ప్రతిపాదన వచ్చినప్పుడు తెరాస ఉంటుందా? అనే ఆలోచన వచ్చిందన్నారు. తెరాస పార్టీనే ఉండదు అనుకుంటే కలలో కూడా ఊహించని విధంగా అధికారంలోకి వచ్చామన్నారు. మేం తెలంగాణ కోరుకున్నాం. బోనస్‌గా అధికారం కూడా వచ్చింది. నా స్థాయికి మంత్రి పదవే ఎక్కువ. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆశ, ఆలోచన లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై ఎన్నో ఆలోనలున్న కెసిఆర్ లాంటి నాయకుని నాయకత్వం తెలంగాణకు మరో పదిహేనేళ్లయనా అవసరమన్నారు.

చిత్రం... మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటిఆర్