తెలంగాణ

మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 18: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేసి.. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు టిఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్‌ఇ కార్యాలయ పనులను పరిశీలించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు 4.325మెగావాట్ల విద్యుత్ ఉంటే 2019వరకు 24వేల మెగావాట్ల ఉత్పత్తి చేసి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 95వేల కోట్లతో 20వేల విద్యుత్ మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే 5వేల మెగావాట్ల సోలార్‌విద్యుత్ సైతం లక్ష్యంగా ఎంచుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని, పరిశ్రమలు మూతపడుతాయని అసెంబ్లీ సాక్షిగా నాయకులు చెప్పారని, కానీ తాము 6నెలల్లోనే విద్యుత్ కోతలు ఎత్తివేసి వ్యవసాయం, పరిశ్రమలకు నిర్విరామంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉంటేనే కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు వస్తాయని సిఎం కెసిఆర్ విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించారన్నారు. విద్యుత్ రంగంలో పూర్తిగా మార్పులు చేపట్టి ఐఎఎస్‌కు బదులుగా విద్యుత్ రంగంలో పని చేసిన సాంకేతిక నిపుణులకే విద్యుత్ నిర్వహణ శాఖను అప్పగించడం వల్ల ఈరోజు విద్యుత్‌శాఖ పరిస్థితి చాలావరకు మెరుగు పడిందన్నారు. యాదాద్రి, భద్రాద్రి, ఎన్టీపిసి రామగుండం, థర్మల్ ప్రాజెక్టుల్లో 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టణాల్లో 6గం, మండల కేంద్రాల్లో 8గం, గ్రామాల్లో 9గం. కరంట్ కోతలు ఉండేవని, ముందుగా కరంట్ కోతలు నివారించాలని సిఎం తమకు ఆదేశాలిచ్చారన్నారు. తాము వెంటనే అవసరమైన విద్యుత్ కొనుగోలు చేసి కోతల నివారణకు చర్యలుచేపట్టామన్నారు.