తెలంగాణ

నెలలోగా 165 గోదాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ఈనెల చివరి నాటికి 165 గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని, ఆగస్టు నాటికి మరో వంద గోదాముల నిర్మాణం పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖపై సచివాలయంలో మంత్రి ఆదివారం సమీక్ష జరిపారు. ప్రస్తుతం వంద గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పా రు. వడగండ్లు, అకాల వర్షాలతో పలు చోట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులలో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోతున్నట్టు వార్తలు వస్తుండడంతో మార్కెటింగ్ శాఖ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతులకు నష్టం కలుగకుండా చూడాలని కోరారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు. మార్కెట్ యార్డుల్లో షెడ్లలో నిల్వ ఉంచాలన్నారు. రాష్ట్రంలో 330 గోదాముల నిర్మాణం చేపట్టామని, వీటి నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేట్టు చూడాలని కోరారు. జిల్లాల వారిగా చేపట్టిన వ్యవసాయ గోదాముల నిర్మాణాల పురోగతిని హరీశ్‌రావు సమీక్షించారు. విత్తనాలు, ఎరువులు నిల్వ ఉంచే ప్రాంతాల్లో గోదాముల నిర్మాణాల పురోగతిని హరీశ్‌రావు సమీక్షించారు. 1024 కోట్ల రూపాయల వ్యయంతో 330 గోదాములను 17.07లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించినట్టు చెప్పారు. ఈ గోదాములను ఖరీఫ్ సీజన్‌లో పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. పలు జిల్లాల్లో గోదాముల నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ కమిషనర్, గిడ్డంగుల సంస్థ ఎండి శరత్ తదితర అధికారులు పాల్గొన్నారు.