ఆంధ్రప్రదేశ్‌

గ్రామాల్లో దాణా బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ వేసవిలోఎదురయ్యే సమస్యలకు తగిన కార్యాచరణ చేపట్టాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, సాగునీరు, వ్యవసాయం, ఉద్యాన పంటలు, ఇతర అంశాలపై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముఖ్యమంత్రి తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడా మనుషులు, పొలాలు, పశువులకు నీటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. 13 జిల్లాల్లో పశుగ్రాసం కొరత రానీయకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పశుగ్రామం కోసం ప్రతి గ్రామంలో ఫోడర్ (దాణా) బ్యాంక్ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఫోడర్ బ్యాంక్ కోసం కనీసం 50 ఎకరాల స్థలాన్ని అవసరమైతే అద్దెకైనా తీసుకుని పశువుల కోసం గ్రాసం పెంచి కనీస ధరకు రైతులకు అందజేయాలని సిఎం తెలిపారు. జల వనరుల శాఖ, నరేగా, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పని చేసి రేపు వానలు కురిసే నాటికి పంట కుంటల్ని సిద్ధం చేసి ఉంచాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. జాతీయ ఉపాధి పథకం కింద ఈ పనులు చేపట్టడం ద్వారా గ్రామాల్లో నిరుపేదలకు పని కల్పించినట్టవుతుందని అన్నారు. 10 లక్షల పంట కుంటల్ని సిద్ధం చేసి ఉంచడం ద్వారా రేపు వరద జలాన్ని సంరక్షించుకుని పంట అవసరాలకు వినియోగించుకోగలుగుతామని తెలిపారు. నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల్లో రబీ కొనుగోళ్ళు మొదలైనందున రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులకు సిఎం సూచనలు చేశారు. పామాయిల్ రైతులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై సంప్రదింపులు జరపాలని అధికారులకు సిఎం సూచించారు. రానున్న ఖరీఫ్ కాలానికి రైతుల్ని సంసిద్ధం చేసేలా వ్యవసాయశాఖ ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు చేశారు.