తెలంగాణ

బాసరకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: చదువుల తల్లి కొలువైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి ఆలయానికి గురువారం భక్తజనం పోటెత్తారు. తదియ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని అమ్మవారి చెంత తమ చిన్నారులకు అక్షర స్వీకార పూజలు నిర్వహించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకే శుభగడియలు ఉండడంతో వెయ్యి రూపాయల అక్షర స్వీకార పూజలకు భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపం భక్తులు చిన్నారులతో కిటకిటలాడింది. అమ్మవారి చెంత తమ చిన్నారులకు అక్షరాలు దిద్దిస్తే ఉన్నత విద్యావంతులవుతారని భక్తుల నమ్మకం. ఒక్కరోజే అమ్మవారి చెంత 900 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా అక్షర స్వీకార పూజలు నిర్వహించారు.

అక్షర స్వీకార పూజల కోసం క్యూలైన్‌లో బారులుతీరిన భక్తులు