తెలంగాణ

ఎస్కార్టు కళ్లుగప్పి జీవిత ఖైదీ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, మే 16: ఎస్కార్ట్ కళ్లుగప్పి ఓ పేరుమోసిన జీవిత ఖైదీ తప్పించుకుపోయిన సంఘటన సోమవారం వరంగల్ జిల్లా జనగామ మండలం యశ్వంతాపురం బ్రిడ్జి వద్ద జరిగింది. ఖైదీ తప్పించుకుని పరుగులు తీస్తుండగా ఎస్కార్ట్ ఆరురౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ ఖైదీ చాకచక్యంగా పోలీసులను తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం భరత్‌నగర్ కాలనీకి చెందిన నాగం సురేష్ అలియాస్ సూరి(40) వివిధ నేరాలకు పాల్పడి 21 క్రిమినల్ కేసులు, రెండు మర్డర్ కేసులు రుజువైనందున అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. నిజామాబాద్ నావిపేటలో 2012లో మర్డర్ కేసు కింద హైదరాబాద్ చర్లపల్లి జైలులో జైలుశిక్ష అనుభవిస్తున్న అతను తోటి ఖైదీలతో గొడవ పడుతుండగా అతన్ని 2013లో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతని కేసుల కోసం సోమవారం నాంపల్లి కోర్టుకు తరలించి వరంగల్ జైలుకు తీసుకొస్తుండగా ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్నాడు. అతనికి ముగ్గురు ఎస్కార్ట్ సభ్యులు ఉండగా అందులో ఇద్దరి వద్ద ఎస్ ఎల్ ఆర్ తుపాకులు, మరోకరు ఖైదీని పట్టుకునేందుకు సెక్యురిటీగా వెళ్లారు. అతన్ని ఆర్టీసీ బస్సులో వరంగల్ తీసుకొస్తుండగా నారపల్లి, అన్నోజిగూడల మధ్య మూత్ర విసర్జన కోసం బస్సు ఆపి దిగాడు. అలాగే వరంగల్ బయల్దేరి యశ్వంతాపూర్ బ్రిడ్జి వద్దకు రాగానే మళ్లీ మూత్రవిసర్జన కోసం దిగాడు. అతని వెంట ఆయుధాలు ఉన్న ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులు అంజయ్య, మల్లయ్యలు, అలాగే లింగారెడ్డిలు అతన్ని బస్సు దింపి జాతీయ రహదారి పక్కకు మూత్రవిసర్జనకు తీసుకెళ్లారు. ఖైదీ సురేష్ వారిని ఉడాయించి పక్కనే ఉన్న చెలుకల్లో పరుగులు తీశారు. అప్రమత్తమైన ఎస్కార్ట్ సిబ్బంది ఆరురౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ అతను సమీపంలో ఉన్న యశ్వంతాపురం వాగులోకి దిగి అందులో నుంచి కనిపించకుండా పరారయ్యాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 4.15 గంటలకు జరుగగా సమాచారం అందుకున్న స్థానిక డిఎస్పీ పద్మనాభరెడ్డి, ట్రెయినీ ఐపి ఎస్ రాహుల్ హెగ్డే, రూరల్ సిఐ బి. తిరుపతి, స్థానిక ఎస్సైలు శ్రీనివాస్, సంతోషం రవీందర్‌లు 15 నిముషాల్లో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మొదటి దఫా వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి అడిషనల్ ఎస్పీ యాదయ్య, కాజీపేట ఎసిపి జనార్దన్, స్టేషన్‌ఘనపూర్ సిఐ కిషన్ బృందాలుగా విడిపోయి రాత్రి 8 గంటల వరకు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆరురౌండ్ల కాల్పులు జరుపడంతో పెద్దగా శబ్దం రావడంతో యశ్వంతాపూర్ గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఎన్‌కౌంటర్ జరుగుతుందని పుకార్లు కావడంతో గ్రామస్థులు ఇళ్లలోనే ఉండిపోయారు. కాల్పుల్లో ఖైదీ గాయాలై మృతిచెందినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై స్థానిక డిఎస్పీ పద్మనాభరెడ్డిని వివరణ కోరగా ఖైదీ తప్పించుకుంది వాస్తవమేనని, అతను ఉప్పల్ ప్రాంతానికి చెందిన పేరుమోసిన రౌడీషీటర్ అని, అతను తప్పించుకుపోయాడే తప్ప మృతిచెందలేదని వివరించారు. అతనికి ఎస్కార్ట్‌గా ఉన్న సిబ్బందిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, వారి ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తప్పించుకుపోయిన ఖైదీగా భావిస్తున్న సురేష్ (ఫైల్‌ఫొటో)