సబ్ ఫీచర్

మనసుల్ని కదిలించేది పల్లెటూరు నేపథ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దర్శకుడు వీజే రెడ్డి
హీరోల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయకూడదని అలా తీస్తే మూసతో కూడిన చిత్రాలే వస్తాయని అంటున్నారు దర్శకులు వేదిరెడ్డి జయరాం రెడ్డి. ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ‘నెల్లూరి పెద్దారెడ్డి’. వినోదానికి పెద్దపీట వేస్తూ సాగిన ఈ చిత్రం అందరి ప్రశంసలందుకుంది. ఈ సందర్భంగా వీజే రెడ్డితో ఇంటర్‌వ్యూ..
* నెల్లూరి పెద్దారెడ్డి ఎలాంటి అనుభూతినిచ్చింది?
- చక్కటి అనుభూతిని కలిగించింది. వినోదాత్మకంగా సాగి ప్రతి ఒక్కరినీ కదిలించి ఆలోచింపజేసింది. నూటికి నూరుపాళ్లు నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. మొదట నేనేదైతే అనుకున్నానో అదే కథని తెరపైకి తీసుకొచ్చా. చదువుకునే రోజుల్నుంచే సినిమాలు చూడడం, కథలు రాయడం అలవాటు. కొద్దిగా స్థిరపడిన తర్వాత నేను ఎప్పట్నుంచో చెప్పాలనుకొన్న ఓ కథని ఈ చిత్రంతో చెప్పా. అది అందరికీ నచ్చడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్ రఘునాథరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సతీష్‌రెడ్డి, వౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా నటించి ఆయా పాత్రలకు నిండుదనం తెచ్చారు. పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన కథా, కథనాలతో ‘నెల్లూరి పెద్దారెడ్డి’ని రూపొందించాం. నెల్లూరి నుంచి ఖమ్మం జిల్లా సీతారాంపురం అనే గ్రామానికి వలస వచ్చిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ ఇది. అలా అతన్ని అంతా నెల్లూరి పెద్దారెడ్డి అని పిలుస్తుంటారు. ఆ గ్రామంలోని వాళ్లంతా అతడిని గౌరవిస్తుంటారు. నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి

ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపించాం. కథలో కొన్ని సన్నివేశాలు విషాదంగా సాగి అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాలను సమతూకం చేసేందుకు జబర్దస్త్ శాంతి స్వరూప్ లాంటి నటులతో చింతామణి నాటక రిహార్సల్స్ సన్నివేశాలు రూపొందించడంతో అవి ప్రేక్షకుల్లో బాగా పేలి చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ సన్నివేశాలకు ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
* చిత్ర పరిశ్రమలో బాగా పాపులర్ అయిన పేరు నెల్లూరి పెద్దారెడ్డి. ఈ పేరునే మీ చిత్రానికి టైటిల్‌గా పెట్టడంలో ఆంతర్యం ఏమిటి?
- అవును. ఈ పేరు పరిశ్రమలో బాగా పాపులర్. ఆ పెద్దారెడ్డి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తే మా నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులను చక్కటి సందేశంతో పాటు మరిచిపోలేని అనుభూతిని అందించాడు. తన మంచితనంతో పది మందికీ ఉపయోగపడే వ్యక్తిత్వంతో ఉండే మా పెద్దారెడ్డి పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కుల్నే వేశారు. పాపులర్ పేరును మా చిత్రానికి టైటిల్ పెట్టినందుకు మాకు ఎంతో సంతోషాన్ని అందించింది. టైటిలే మాకు చిత్రం ముందుకు సాగడంలో ధైర్యాన్ని ఇచ్చింది.
* హీరో పాత్రని మలిచిన తీరుపై మీ స్పందన?
- ఈ క్యారెక్టర్‌ను హీరో సతీష్‌రెడ్డి సమర్ధవంతంగా పోషించాడు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం ప్రతి ఒక్కరికీ నచ్చింది. గ్రామానికి సర్పంచ్ అయిన నెల్లూరి పెద్దారెడ్డి అంటే గ్రామ ప్రజలకు విపరీతమైన అభిమానం. అయితే గ్రామం అంతా గౌరవంగా చూసే నెల్లూరి పెద్దారెడ్డికి భార్య ముంతాజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాంతో ఆమె పెద్దారెడ్డి పట్ల కోపంతో రగిలిపోతుంటుంది. సరిగ్గా అదే సమయంలో నెల్లూరు పెద్దారెడ్డికి మీనాక్షి (వౌర్యాని) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయం పెద్దారెడ్డి భార్య ముంతాజ్‌కు తెలియడంతో మీనాక్షిని చంపించడానికి పన్నాగం పన్నుతుంది. అసలు నెల్లూరి పెద్దారెడ్డికి భార్య ముంతాజ్‌కు ఉన్న గొడవ ఏంటి? మీనాక్షిపై ఎందుకు మనసు పారేసుకున్నాడు? ముంతాజ్ కుట్ర నుండి మీనాక్షిని ఎలా కాపాడాడు? తదితర ఆసక్తికరమైన అంశాలతో చిత్రం సాగడంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది. పెద్దారెడ్డి పాత్రలో సతీష్‌రెడ్డి లీనమై నటించాడు. గ్రామ పెద్దగా, భార్యపై అసహనం వ్యక్తం చేసే పాత్రలో, అలాగే మీనాక్షి పట్ల ప్రేమని చూపించే పాత్రలో, యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా మెప్పించాడు.
* పల్లెటూరి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కదా, మళ్లీ మీరు అదే బాటలో పయనించారెందుకు?
- పల్లెటూరి నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చినా వేటి ప్రాధాన్యత వాటిదే. అందుకే అలా వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని మిగిల్చాయి. మనసుల్ని కదిలించాయి. వాటిని ఎప్పుడూ ఆదరిస్తూనే వున్నారు. పల్లెటూరి నేపథ్యంతో వచ్చే ప్రతి సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చక్కటి గ్రామీణ వాతావరణంలో జరిగే కథని అంతే చక్కగా తెరకెక్కించాం. ఈ తరహా కథలు ముఖ్యంగా మాస్ జనాల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇటీవల కాలంలో గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు చాలా తక్కువ. ఇప్పుడంతా అల్ట్రా మోడ్రన్ కాలం. టెక్నాలజీ పెరిగింది. మనిషి ఆలోచనలు కూడా పెరిగాయి. అలాంటి నేపథ్యంలో ఫక్తు పల్లెటూరి నేపథ్యంలో మా చిత్రం తెరకెక్కింది.
* మీకు ఎలాంటి కథలంటే ఇష్టం?
- కథలో దమ్ము ఉండాలి. అది ఎలాంటి ఇతివృత్తమైనా ప్రేక్షకుల మనసుల్ని కదిలించి ఆలోచింపజేయాలి. ఫీల్‌గుడ్ కథగా అందరి హృదయాలను కొల్లగొట్టాలి. కుటుంబ నేపథ్యంలో సాగే కామెడీ కథలంటే నాకు బాగా ఇష్టం. ఇలాంటి కథలతో సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తే అవి మంచి విజయాలను అందుకుంటాయి. నేను ఎక్కువగా ఇష్టపడే కథలు ఇవే. కథలో ప్రేక్షకులు కోరుకునే ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాలు సమపాళ్లలో ఉన్నప్పుడే వాటికి ఆదరణ లభిస్తుంది. నా దగ్గర కొత్తరకమైన కథలు చాలా ఉన్నాయి.
* దర్శకుడు కావాలంటే..?
- దర్శకుడు కావాలంటే మంచి కథ ఉండాలి. అది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ అయి ఉండాలి. దాన్ని అద్భుతంగా తీయగల అనుభవం కావాలి. అదే సమయంలో మన హీరోల ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకూడదు.
* ఈ కథకు స్ఫూర్తి?
- తక్కువ బడ్జెట్‌లో ఓ సినిమా చేయాలని అనుకుని ఈ కథను ఎంచుకున్నాం. కమర్షియల్ సినిమాలను బాగా చేయగలిగే దర్శకులు మన చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అయితే నేను మాత్రం ఇలాంటి సినిమా చేయాలని ముందుగానే అనుకుని చేశాను. ఇందులో ఏదీ ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. నేను అనుకున్న జోనర్ ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశంతో చేశాను.
* మీ తదుపరి చిత్రం ఎప్పుడు?
- త్వరలోనే వుంటుంది.

-ఉషశ్రీ తాల్క