సబ్ ఫీచర్

శిథిల వలలకు తిమింగలాలు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్ల తిమింగలాలు (వీటినే రైట్ వేల్స్ లేదా బ్లాక్ వేల్స్ అంటారు) మూడు రకాలు. అవి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉండేవి. ఉత్తర పసిఫిక్ సముద్రంలో ఉండేవి. భౌగోళం దక్షిణార్థం సముద్రంలో ఉండేవి. వీటిలో ఉత్తర అట్లాంటిక్ తిమింగలాలు స్కూల్ బస్సు పరిమాణంలో నల్లగా, పెద్దగా ఉంటాయి. వీటి నోరు గరిటెలా పొడవుగా ఉండి, ముఖంమీద తెల్లటి మచ్చలు ఉంటాయి. ఇవి సముద్రపు అట్టడుగున ఉండే గడ్డి మొక్కలని తింటాయి. అప్పుడప్పుడు సముద్రం ఉపరితలాలకు వచ్చి గాలిలోకి ఎగిరిపడుతుంటాయి. సముద్ర ప్రయాణం చేసేవారికి వాటిని చూస్తున్నప్పుడు సరదాగాను, ప్రశాంతంగాను ఉంటుంది.
‘సముద్ర జలాలకి అందాన్ని, చిలిపితనాన్ని తెచ్చే ఈ ఉత్తర అట్లాంటిక్ నల్ల తిమింగలాలు దురదృష్టవశాత్తు కళేబరాలుగా సముద్రంపై తేలియాడుతూ కనిపిస్తున్నాయి. గత 16 సంవత్సరాలుగా ఇలా చనిపోయినవేవీ కూడా సహజంగా మరణించినవి కావు’’ అని డా. షార్ప్ అంటారు. ఈమె ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ ఏనిమల్ వెల్ఫేర్ సంస్థలో తీరప్రాంత క్షీరదాల సంరక్షణకు సంబంధించి కోఆర్డినేటర్‌గా ఉంటున్నారు. ‘‘డిసీజెస్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్’’ అనే జర్నల్ ప్రచురించిన ‘‘రీసెంట్ స్టడీ’’ వ్యాసానికి ఈమె ప్రధాన రచయిత్రి. 2003-2018 సంవత్సరాల మధ్యకాలంలో ఉత్తర అట్లాంటిక్ నల్ల తిమింగలాలు చనిపోవడానికి గల కారణాలను ఈ వ్యాసంలో వివరించారు.
ఉత్తర అట్లాంటిక్ నల్ల తిమింగలాలు చనిపోయినప్పుడు వాటి కళేబరాలు ఒడ్డుకు కొట్టుకొని రావడమో, సముద్ర జలాలపై తేలియాడుతుండడమో జరుగుతుంది. వాటి గురించి ఎవరైనా సమాచారం ఇస్తే సైంటిస్టులు ఆ కళేబరాలను కోసి, అధ్యయనం చేస్తారు. ఇలా పరీక్షలు జరిపిన 48 ఉత్తర అట్లాంటిక్ నల్ల తిమింగలాలలో 38 మానవ తప్పిదాలవల్లనే చనిపోయాయని తేలింది. 16 తిమింగలాలు సముద్రంలో ప్రయాణించే ఓడల ప్రొపెల్లర్ల దెబ్బకి చనిపోయాయి. 22 తిమింగలాలు సముద్రంలో పారేసిన శిథిలమైన వలల్లో చిక్కుకుని మరణించాయి. అంటే ప్రమాదవశాత్తు కన్నా సముద్రంలో పారేసిన వ్యర్థాల వల్లనే చేపలు మొదలైన జలచరాలు బలవుతున్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు సముద్రంలోంచి గాల్లోకి ఎగిరి దూకుతూ చూపరులకు ఆహ్లాదాన్ని కలిగించే జలచరాలు ఇప్పుడు కళేబరాలుగా సాగర జలాలపై తేలియాడుతున్నాయి. వాటిలో చాలావరకు అసహజ మరణం పొందినవే. కొన్నింటి కళేబరాలకు సముద్రంలో ప్రయాణించే ఓడల ప్రొపెల్లర్ గాట్లున్నాయి. కొన్నింటి కళేబరాలయితే సముద్రంలో వదిలేసిన శిథిలమైన వలలు చిక్కుకొనిపోయి ఉన్నాయి. ఇలా అసహజంగా, దారుణంగా మృత్యువాతపడ్డ ఆ చేపల కళేబరాలను చూసిన వారికెవరికైనా సరే బాధతో గుండె విలవిల్లాడుతుంది. సముద్రంలో పారవేసే శిథిలమైపోయిన ప్లాస్టిక్ వలలవల్లనే కాకుండా నిత్యం లక్షల సంఖ్యలో డంప్ చేస్తున్న ప్లాస్టిక్ స్ట్రాలు ముక్కులలో ఇరుక్కుని ఊపిరాడక పెద్దసంఖ్యలో సముద్ర తాబేళ్ళు చనిపోతున్నాయి కూడా.
‘‘నాగరికతా వికాస క్రమంలో ఒక కీలక దశలో ఉన్న మనం ప్లాస్టిక్‌వల్ల ఉత్పన్నవౌతున్న అన్నిరకాల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా సముద్రాల పరిస్థితి ఎలా ఉందంటే అవి ‘ప్లాస్టిక్ ద్రావకం’(ప్లాస్టిక్ సూప్)లా తయారయ్యాయి’’ అని ప్లాస్టిక్ పొల్యూషన్ కోలిషన్ సంస్థకు సిఈవోగా పనిచేస్తున్న డయానా కోహెన్ అంటారు.
గత కొన్ని దశాబ్దాలుగా క్యారీబ్యాగ్స్, వాటర్ బాటిల్స్ లాంటి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం బాగా పెరిగింది. వీటి వినిమయం కొన్ని నిమిషాలు మాత్రమే. ఇక స్ట్రాలు అయితే ఒక నిమిషం కూడా వినియోగంలో ఉండవు. కానీ ఆ తరువాత ఇవి పెను కాలుష్యభారంగా తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలన్నీ శతాబ్దాల తరబడి భూమిలో కలిసిపోకుండా అలాగే ఉంటాయి. నగరీకరణ జరిగిన ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం లేకుండా జీవితం గడపడం అన్నది సగటు మనిషి ఊహకు కూడా అందని విషయం. కానీ ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నియంత్రించే విషయమై మనమంతా గట్టిగానే ఆలోచించాలి.
ప్రతి ఏటా 6 లక్షల 40వేల టన్నుల శిథిలమైన ప్లాస్టిక్ వలలను సముద్రంలో పారేస్తున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా. సాధారణంగా తిమింగలాలు, సీల్స్‌వంటి పెద్దపెద్ద చేపలను ఆహారం కోసం వేటాడి చంపరు. ఇవి మృత్యువాత పడుతున్నాయంటే లేదా తీవ్రంగా గాయపడుతున్నాయంటే అందుకు కారణం సముద్రంలో పారేసిన శిథిల వలలే. అమెరికా యేతర దేశాలవారు సముద్రంలో పారేసిన శిథిల వలల వల్ల ప్రతియేటా తిమింగలాలు, సిల్స్ వంటి 6 లక్షల 50 వేల పెద్దపెద్ద చేపలు చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరుగుతోందని అమెరికాలోని నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ ఇంకార్పొరేషన్ అంచనావేసింది.
ఇప్పటికే మత్స్య పరిశ్రమల వల్ల సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వారి వేటకు బలయ్యే చేపలలో 60 శాతం మాత్రమే ఆహారం కోసం వినియోగపడేవి. మిగతా 40 శాతం చేపలు సముద్రంలో వేటకి వెళ్ళిన పడవలకు ప్రమాదవశాన తగులుకుని, లేదా సముద్రంలో పారవేసిన శిథిల వలలకు చిక్కుకుని చనిపోతున్నాయి.
ఉత్తర అట్లాంటిక్ నల్ల తిమింగలాలు కొన్నిసార్లు సముద్రంలో వదిలేసిన శిథిల వలల్లో చిక్కుకుంటాయి. అయితే చాలా సందర్భాలలో అవి చేపలు పట్టేటప్పుడు వేసిన వలల్లోనే చిక్కుకుంటాయి. పెద్దసంఖ్యలో ఇలా తిమింగలాలు చనిపోవడం చాలా బాధాకరమని షార్ప్ అంటారు. ఒక్కోసారి గాలి పీల్చుకోడానికి తిమింగలాలు సముద్ర ఉపరితలానికి వస్తాయి. కానీ సముద్రంలోపల వలల్లో చిక్కుకోవడం వల్ల వాటికి ఇది సాధ్యంకాదు. అందువల్ల వాటికి సహజంగా ఊపిరి పీల్చుకోవడం ఉండదు. మానవ కారకమైన ఈ అకాల మరణాలు పర్యావరణ వినాశకరమైనవి. సాగర జీవాల వలసలు, పునరుత్పత్తిపై కూడా ఇది తీవ్రప్రభావాన్ని చూపుతోంది.
సముద్రాలలో విడిచిపెట్టేసిన శిథిల వలల గురించి, అవి సాగర జీవాలకు కలిగించే నష్టం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అదొక అత్యవసరమైన విషయమని చాలామంది భావించడం లేదు. చాలామందికి సముద్ర తీరాలలో కనిపించే ప్లాస్టిక్ సంచులు, సీసాలు, స్ట్రాలు, బెలూన్లు మొదలైన వ్యర్థాలే కనిపిస్తాయి.
మనం ఒకటిరెండు నిమిషాలే వాడి అవతల పారేసే ప్లాస్టిక్ స్ట్రాలు మురుగుకాలవల ద్వారా పెద్దసంఖ్యలో సముద్రాలలో కలుస్తున్నాయి. ‘లోన్లీవేల్స్’ అనే సాగర పరిరక్షణ సంస్థకు డ్యూన్ ఐవ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ‘‘స్ట్రారహిత సముద్రాలు’’ అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తుంది. సైకాలజీలో పిహెచ్.డి చేసిన డ్యూన్ ఐవ్స్ ప్రజల ఆలోచనలలో సకారాత్మక దృక్పథాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘లోన్లీవేల్స్’ సంస్థ ద్వారా వివిధ ప్రాంతాలలో ఉండేవారిని కొందరిని ఎంపిక చేసుకుని సముద్ర విహారానికి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన వారికి సాగర జలాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలను చూపి, మన దైనందిన జీవితాలపై వాటి దుష్ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తారు. ఇలా సముద్ర విహారానికి వెళ్ళేవారిలో తమ జీవితాలలో సముద్రాన్ని చూడనివారు కూడా ఉంటారు. తమ ప్రయత్నం ప్రజల ఆలోచనలలో మార్పు తీసుకురావడంలో సత్ఫలితాలని ఇస్తోందని, అయితే ఇది మాత్రం సరిపోదనీ, తాము చేయాల్సింది ఇంకా ఎంతో ఉందనీ డ్యూన్ ఐవ్స్ అంటారు.
‘‘సముద్రాలలో వ్యర్థాలుగా పేరుకుపోతున్న స్ట్రాలను నిర్మూలించడంలో మేము చేస్తున్న ప్రయత్నాలు కేవలం స్ట్రాలకు మాత్రమే పరిమితంకాలేదు. ఇది మా మొదటి అడుగు మాత్రమే. మేము ఆశిస్తున్న సమూలమైన మార్పుకు ఇది ఒక సూచిక. మా ప్రయత్నానికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోంది’’అని డ్యూన్ ఐవ్స్ అంటారు. మనం ఏ మత్స్య పరిశ్రమకో అధినేతలం కాకపోవచ్చు, లేదా చేపలు వేటాడే వాళ్ళంకాకపోవచ్చు. అయినాసరే మత్స్య సంపదను కాపాడుకునే విషయంలో మనకూ బాధ్యత ఉంది. చేపలు తినడాన్ని, ఇతరత్రా మత్స్య వినిమయాన్ని తగ్గించే విషయంలో మనమంతా సామూహికంగా ఒక నిర్ణయం తీసుకుంటే చేపలకు ప్రాణాంతకవౌతున్న శిథిలమైన వలలను సముద్రంలో విడిచిపెట్టడం తగ్గుతుంది. ఎందుకంటే మత్స్య వినిమయం తగ్గితే చేపల వేట కూడా తగ్గుతుంది కదా. అయితే మత్స్య సంపదని పరిరక్షించుకునే బాధ్యత మొత్తం వినియోగదారుని మీదనే మోపకూడదు. వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించి అవసరమైన చట్టాలను చేయాలి.

- ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్, 80082 64690