సబ్ ఫీచర్

అసంక్రమిత వ్యాధుల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మన దేశంలో అసంక్రమిత వ్యాధుల మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గుండె జబ్బులు, క్యా న్సర్, మధుమేహం, రక్తపోటు లాంటి అసంక్రమిత వ్యాధుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతూ అకాల మరణాలకు గురయ్యేవారి సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి నివేదిక ప్రకారం దేశం మొత్తం మరణాలలోని అసంక్రమిత వ్యాధుల మరణాలు 1990లో 37.9 శాతంతో పోలిస్తే 2016లో 61.8 శాతానికి చేరింది. గత 25 సంవత్సరాలలో దేశం మొత్తం మీద మరణాలలో అసంక్రమిత వ్యాధుల మరణాలు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. పేదల నుండి ధనికుల వరకు ఈ వ్యాధుల ప్రభావం నుంచి తప్పించుకోలేని క్లిష్ట పరిస్థితులు రోజురోజుకూ ఎదురవుతున్నాయనేది నిర్వివాదాంశం. నేడు మనం తినే ఆహారం కేవలం కడుపు నింపేందుకు తప్ప, శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు సమపాళ్లలో లభించే ‘సమతుల్య ఆహారం’ అందడం లేదు. ఫలితంగా శరీరం పలురకాల వ్యాధులకు నిలయం అవుతోంది.
అసంక్రమిత వ్యాధులకు కొంతవరకు వయస్సు కారణం అయినప్పటికీ, చాలా మరణాలు వయసుతో నిమిత్తం లేకుండా సంభవిస్తున్నాయి. తగ్గుతున్న శారీరక శ్రమ, అధిక కొవ్వు, సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, కల్తీ ఆహార పదార్థాలు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలు కావడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, జీవనశైలిలో వస్తున్న మార్పులు, వాతావరణ కాలుష్యం, జన్యుపరమైన లోపాలు అసంక్రమిత వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణమవుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకూ అన్ని వర్గాల వారూ ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అనేక జాతీయ, రాష్టస్థ్రాయి ఆరోగ్య పథకాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఆధునిక వైద్య సదుపాయాలు ప్రభుత్వ వైద్యశాలల్లో తగినంతగా అందుబాటులో ఉండడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేక పేద, మధ్య తరగతి ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారన్నది చేదు నిజం.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో అసంక్రమిత వ్యాధుల ప్రభావం మితిమీరి అకాల మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులకు కారణాలను అనే్వషించి, రోగులకు అధునాతన చికిత్సను అందించాలి. ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆరోగ్య చరిత్రను సేకరించాలి. తరచూ వైద్యపరీక్షలు నిర్వహించి, భవిష్యత్తులో సంభవించే వ్యాధులను గుర్తించాలి. అసంక్రమిత వ్యాధులపై ప్రజానీకానికి అవగాహన కల్పించి, ముందు జాగ్రత్త చర్యలను తెలియజేయాలి. తక్కువ ఆహారాన్ని, ఎక్కువ మోతాదులో పోషక విలువలు ఉండేలా తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించాలి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే ఆస్పత్రులను విరివిగా నిర్మించి అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తేవాలి. నాణ్యమైన వైద్య చికిత్సను ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. వెల్‌నెస్ కేంద్రాలను విరివిగా ఏర్పాటుచేసి ఆరోగ్య పరీక్షలను నిర్వహించి వ్యాధులను ఎప్పటికప్పుడు నిర్ధారణ చేయాలి. తక్కువ ధరలకు మందులను అందించాలి. మార్కెట్లో ప్రబలుతున్న ఆహార కల్తీలపై తనిఖీలు చేసి, నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందేలా చూడాలి. పొలాల్లో క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువులు వాడకుండా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ విధిస్తూ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి.

-సంపతి రమేష్ మహారాజ్ 99595 56367