సబ్ ఫీచర్

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పంచపాండవులు ఎంతమంది అంటే.. మంచం కోళ్ల మాదిరి మూడే..’’ అంటూ రెండు చూపుడు వేళ్లు చూపించాడట వెనుకటికి ఒక వ్యక్తి. వెనుకబడ్డ ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు నూతన ప్రభుత్వం కేటాయించిన నిధుల గురించి పరిశీలిస్తే అదే సామెత గుర్తుకొస్తుంది. ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 24 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే, వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఇటీవల సమర్పించిన బడ్జెట్‌లో 700 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించి ఉత్తరాంధ్రకు మొండిచేయి చూపిం చింది. న్యాయంగా ఉత్తరాంధ్రకు రాష్ట్ర బడ్జెట్‌లో 15 నుండి 20 శాతం నిధులు కేటాయించాలి. ఉత్తరాంధ్ర సాగునీటి రంగానికి కనీసం రూ.2000 కోట్లు నిధులు ఇవ్వాలి. నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దు లుపుకోవడాన్ని గమనిస్తే ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రభుత్వం ఎంత చులకన భావంతో వ్యవహరించిందో స్పష్టవౌతుంది.
ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే- అందులో 8 లక్షల ఎకరాలకు మించి నీటి వసతి లేదు. ఉత్తరాంధ్రలో 16 చిన్న, మధ్యతరహా నదులు ఉన్నాయి. వీటిల్లో ఏటా 207 టియంసి నీటి లభ్యత ఉండగా, కేవలం 100 టియంసి నీటిని మాత్రమే వినియోగించు కొంటుండగా, మిగిలిన నీరు సముద్రపాలు అవుతున్నది. ‘‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’’ అన్నట్లు ఉత్తరాంధ్రలో సాలీనా 1050 మి.మీ పైనే వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంతంలో సుమారు కోటిమంది ప్రజలు తాగునీరు, సాగునీరు సమస్యలతో సతమతమవ్వడం శోచనీయం. ఈ ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించడం తప్ప మరో మార్గం లేదు. గోదావరి జలాల ద్వారా నిర్మించతలపెట్టిన ‘బాబూ జగ్జీవన్‌రాం సుజల స్రవంతి’ ప్రాజెక్ట్ తక్షణమే చేపడితేనే ఈ ప్రాంత కరువు కాటకాలను పారద్రోలవచ్చు, ఎనిమిది లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందిం చవచ్చు, 1200 గ్రామాలలో 30 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడానికి వీలవుతుంది.
ఉత్తరాంధ్ర ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో దివంగత నేత డా॥ ఫిబ్రవరి 21, 2009న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన అడుగుజాడల్లో పాలన కొన సాగిస్తామని చెబుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఒకసారి పరిశీలిస్తే- ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తేటతెల్లమవుతుంది. ఈ ప్రాజెక్టు మొదటిదశ పూర్తికావడానికే 2200 కోట్ల రూపాయలు అవసరం కాగా, బడ్జెట్ లో 170 కోట్లు కేటాయంచారు. ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాజెక్ట్‌లకు కూడా నామమాత్రపు నిధులను కేటాయంచి సవతితల్లి ప్రేమ చూపుతున్నారు.
విశాఖ జిల్లాలో జలాశయాల కాలువల ఆధునీకరణ, నిర్వహణ పనులకు నీటిపారుదల శాఖాధికారులు చేసిన ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. పెద్దేరుకు రూ.50 లక్షలు, కోణాంకు రరూ.25 లక్షలు, రైవాడకు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. విశాఖ జిల్లాలో ట తాండవ రిజర్వాయర్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తారకరామ, ఉరకగెడ్డ, పాలగెడ్డ, కల్యాణపులోవ, గొర్రిగెడ్డ తదితర ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు నిధుల కేటాయింపులో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. విజయనగరం జిల్లాలో తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి కావడానికి 250 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం 21 కోట్లు మాత్రమే కేటాయించింది. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు బ్యారేజ్ పనులు 90% పూర్తయినా జలాశయం పనులు, బ్యారేజి, జలాశయానికి అనుసంధానంగా తలపెట్టిన కాలువ పనులు పూర్తికావాలంటే ప్రభుత్వం కేటాయించిన 21 కోట్లు ఏమాత్రం సరిపోవు. ఇక తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభించి 3 ఏళ్లు గడుస్తున్నా, పిల్లకాలువలు, స్ట్రక్చర్ల నిర్మాణాలు పెండింగ్‌లోనే వున్నాయి. జంఝావతి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టు పరిధిలో లో లెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్‌లో పూడికతీత, మిడిల్ స్ట్రక్చర్‌లు తదితర పనులు పూర్తిచేయవలసివుంది. పెద్దగెడ్డ, తాటిపూడి, డెంకాడ ఆనకట్టుకు నిధుల కేటాయింపుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వంశధార, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్ల ఆధునీకరణ పనులకు ఒక పైసా విదల్చలేదు. వంశధార స్టేజ్-2, ఫేజ్-2 పనులు పూర్తి కావాలంటే రూ.503 కోట్లు, వంశధార-నాగావళి నదుల అనుసంధానానికి రూ.90 కోట్లు, నాగావళి-చంపావతి నదుల అనుసంధానానికి రూ.30 కోట్లు, నాగావళి ఎడమ-తోటపల్లి కుడి మెయిన్ కెనాల్ పనులకు రూ.180 కోట్లు, వంశధార-నాగావళి ఫ్లడ్ బ్యాంక్స్‌కు రూ.975 కోట్లు అవసరం. వంశధార- బాహుదా నదుల అనుసంధానానికి రూ.6300 కోట్లు అవసరం. వీటిలో దేనికీ నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
1976లో పనులు ప్రారంభించిన జంఝావతి ప్రాజెక్ట్ పూర్తయితే ఒడిశా భూభాగంలో 180 మంది నిర్వాసితులు అవుతారనే కారణంతో ప్రాజెక్ట్ పూర్తి కావడం లేదు. ఒడిశా ప్రభుత్వ వైఖరి కారణంగా చట్టబద్ధంగా నిర్మించు కుంటున్న సేద్యపు నీటి ప్రాజెక్ట్ లకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తమ రాష్ట్రంలో అక్రమంగా పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ ఒడిశా ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తీరని హాని తలపెడుతున్నది. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వంశధార ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్-ఒడిశాల మధ్య 1961 నుండి 1991 వరకు నాలుగు సార్లు జల ఒప్పందాలు జరిగాయి. వంశధారలో లభ్యమయ్యే 115 టియంసిల నీటిని చెరిసగం వాడుకోవాలని రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాలను వమ్ము చేస్తూ, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన నేరడి బ్యారేజి నిర్మాణంపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరాంధ్రకు తీరని నష్టం కలిగిస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం దురదృష్టకరం. ఆంధ్ర ప్రదేశ్‌తో ఎటువంటి ఒప్పందాలు లేకుండానే నదులపై కొత్త నిర్మాణాలు చేబడుతూ ఒడిశా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. బాహుదా నదిపై నిర్మిస్తున్న భగలుట్టి డ్యామ్ ఎత్తు పెంచడం, మహేంద్రతనయ నది ఎగువన పురియాషాహి వద్ద ఆనకట్ట నిర్మాణం, నాగావళి, రుషికుల్య నదుల అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చు.
1941లోనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పోలవరం నుండి శ్రీకాకుళం జిల్లాలోని బాహుదా నది వరకు సాగునీరు అందించాలని ప్రణాళికలు రూపొందించింది. దీని ద్వారా 831 టియంసిల నీటిని సాగు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చని స్పష్టంగా ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల మన పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రణాళిక మరుగున పడిపోయింది. గోదావరి జలాల కేటాయింపుల్లో ఉత్తరాంధ్రకు తొలినుండి పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. పోలవరం ప్రాజెక్ట్‌లో ఉత్తరాంధ్రకు న్యాయబద్ధమైన వాటా లభించాలి. ఉత్తరాంధ్రలోని సీలేరు, శబరి నదులు గోదావరిలో కలుస్తున్నాయి. వాస్తవానికి గోదావరి డెల్టాకు ఎప్పుడు ఇబ్బంది ఏర్పడినా సీలేరు డ్యామ్ నుండే గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. గోదావరి జలాల్లో మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు వాటాలు పొందుతున్నాయి. దీని ప్రకారం గోదావరి జలాల్లో ఉత్తరాంధ్రకు కూడా న్యాయబద్ధమైన వాటా పొందే హక్కు ఉంది. ఈ హక్కు ప్రకారం ఉత్తరాంధ్రకు గోదావరి జలాల్లో తగిన వాటాను కేటాయంచవలసి ఉంది. ఒక ప్రాంతం పట్ల వివక్ష చూపడం వల్ల ప్రభుత్వమే ప్రాంతీయ విభేదాలకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఈ భావన పోగొట్టడానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఔదార్యంతో వ్యవహరించాలి. దివంగత నేత డా॥ కల అయిన ‘‘బాబూ జగజ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు’’ పూర్తిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఉత్తరాంధ్ర ప్రజలు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు. కనీసం ఒక పంటకు సాగునీరు, తాగడానికి గుక్కెడు నీళ్లు అడుగుతున్నారు. తాము వివక్షత గురవుతున్నామనే భావన పోగొట్టడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉత్తరాంధ్రలో కరువుకాటకాలను పారద్రోలడానికి, వలసలు అరికట్టడానికి శాశ్వత పరిష్కారమైన బాబూ జగ్జీవన్‌రాం సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టడంతో పాటు, గోదావరి జలాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర తగిన వాటా కేటాయింపుకు ఔదార్యంతో, దక్షతతో వ్యవహరించాలని ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పోలవరం ఎడమ కాలువ పనులను యుద్ధ ప్రతిపాదికపై పూర్తిచేసి గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి సత్వరం పూర్తి చేయాలి. నూతన ప్రభుత్వం వెనుకబడిన ఔదార్యంతో వ్యవహ రించినప్పుడే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుంది.

-కొణతాల రామకృష్ణ కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక