సబ్ ఫీచర్

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామాలు, పట్టణాలు అని, పేద ధనిక అని, అక్షరాస్యుడు నిరక్షరాస్యుడని తేడాలు లేకుండా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అది కూడా ఆంగ్ల మాధ్యమంలో అందించాలనే తపనతో తమ స్థోమతలకు మించి అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు పాఠశాలలో చదివించడం జరుగుతుంది.
మన గ్రామంలో వున్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించకపోవడానికి గల కారణాలను విశే్లషిస్తే..
* కనీస వసతులైన టాయిలెట్స్, బాత్రూమ్స్, నీటి వసతులు సక్రమంగా లేకపోవడం.
* ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులకు చదువుచెప్పకుండా తమ వ్యాపారాల గురించి ఫోన్లల్లో సంభాషణలు జరుపుతారనే నెపంతో.
* పుట్టగొడుగుల్లా వెలసిన ప్రైవేటు పాఠశాలలు వ్యాపారంలో భాగంగా హంగూ ఆర్భాటాలతో పాఠశాలలను అలంకరించి, అభూతకల్పనలకు గురిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలపై లేనిపోని అబద్ధపు మాటలుచెప్పి ఆకర్షింపజేయడం.
* మన ప్రక్కింటివారి పిల్లలు ఫలానా పాఠశాలలో చదువుతున్నారు, మనకేం తక్కువ అని గొర్రెదాటుడువలే ఆయా పాఠశాలలకు పంపించడం.
* నేడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఆంగ్లమాధ్యమానికి ప్రాముఖ్యతనిస్తున్న తరుణంలో మన వద్దనున్న ప్రభుత్వ పాఠశాలలో అలాంటి సౌకర్యం లేకపోవడం.
* కారణాలేమైతేనేమి గ్రామాలలోనున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల్లేక మూసివేతకు దారితీస్తున్నాయనడంలో అవాస్తవం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే మనకుండే లాభాలను చూస్తే.
* పరిణామక్రమంలో భాగంగా ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పరు అనే మాట అవాస్తవం, ఎంతో ప్రావీణ్యముంటేగానీ పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగం సాధించలేని పరిస్థితి. ప్రైవేటు ఉపాధ్యాయులతో పోలిస్తే కొంతమేర జ్ఞానవంతులే గదా!
* కొన్ని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపులేకుండా, ఒకరి అనుమతితో మరొకరు నడిపిస్తూ, సర్ట్ఫికెట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి.
* ప్రభుత్వ పాఠశాలలో చదివితే ప్రభుత్వమే ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేస్తుంది. మధ్యాహ్నం పౌష్టికాహారాన్ని అందిస్తుంది. కొన్ని తరగతుల వారికి స్కాలర్‌షిప్స్ సైతం అందిస్తుంది.
* ఆంగ్ల మాధ్యమంలో విద్యావకాశాలంటే ఉన్నత పాఠశాలలో దానిని కూడా అందిస్తుంది.
* పదవ తరగతిలో మంచి గ్రేడ్ తెచ్చుకుంటే ఐఐఐటిలో సీటు పొంది ఆరు సంవత్సరాలపాటు నాణ్యమైన సాంకేతిక విద్యను పొందవచ్చు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికే సాధ్యపడుతుంది.
* పాఠశాల విద్య పూర్తయిన తర్వాత వారు ఉచితంగా ఇచ్చే సర్ట్ఫికెట్స్ ఎలాంటి లోపాలులేకుండా ఎంతో కచ్చితత్వాన్నీ కలిగి ఉంటాయి.
* నయాపైసా ఖర్చులేకుండా మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను వదిలేసి, వేలలో, లక్షలలో డొనేషన్స్, ఫీజులను కడుతూ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు తప్ప మరోటిలేదు.
* చదువుకోవాలనే పట్టుదల ఉండి, దానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరిస్తే ఏవైనా సాధ్యపడుతాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు కేవలం మార్కుల కోసమే చదువుతూ మానసిక ఒత్తిడికి లోనవుతారు తప్ప, విషయ పరిజ్ఞానం తెచ్చుకొని జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలో అలాంటి జ్ఞానం పొందలేదన్నది జగమెరిగిన సత్యం.
* ప్రైవేటు పాఠశాలలో ప్రీప్రైమరీ, ప్రైమరీకి బోధించే ఉపాధ్యాయులు ఎలాంటి శిక్షణలేకుండా ఇంటర్ మీడియట్, డిగ్రీ అసంపూర్తిచేసి 5నుండి 10వేల మధ్యలో పనిచేస్తారన్నది నిజం.
పాఠశాలల వలన లాభ నష్టాలను ప్రక్కకుపెట్టి సమస్య పరిష్కార మార్గానికై ఆలోచిస్తే ఫలితముంటుంది. ప్రతి గ్రామం నుండి ఇంటికొకరిని పెట్టుకున్న 50నుండి 100 మంది విద్యార్థులు వివిధ పాఠశాలలో చదవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న నిరుద్యోగిత మూలంగా అలాంటి పాఠశాలలో ఉపాధ్యాయులుగా 5 నుండి 15వేల మధ్యలో పనిచేస్తూ ప్రతి గ్రామంనుండి కనీసం ఐదుగురన్నా పనిచేస్తుంటారు. మరియు నర్సరీ చదివే విద్యార్థికి ప్రైవేటు పాఠశాలలో ఫీజుకట్టాలంటే తక్కువకు తక్కువ 6నుండి 10వేలను ఆయా పాఠశాలలనుబట్టి చెల్లించాల్సిందే. పుస్తకాలనీ, నోటుబుక్స్ అని, యూనిఫామ్, టై, బెల్ట్, షూలు వారికీ ఇలా పెట్టేవి కలిపితే దాదాపు సంవత్సరమంతా లెక్కలేస్తే 20వేలకు వస్తుంది. అలాంటప్పుడు ఆయా ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఐదుగురు ఉపాధ్యాయులకు మనమే జీతమిస్తూ, మన ప్రభుత్వ పాఠశాలలో విద్యనందించుకోవడానికి ఒక మార్గమున్నది.
మన ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలను చేర్పించి, విద్యార్థుల తల్లిదండ్రులచే ఒక కమిటీని ఎన్నుకొని, విద్యాకమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్‌లు కలిసి ప్రభుత్వ అండదండలతో ప్రణాళికలు రూపొందించుకుంటే, ప్రైవేటు పాఠశాలలో చదివిస్తే మనకయ్యే ఖర్చులో సగానికి తక్కువ మొత్తంలో అలాంటి విద్యను పొందడానికి వీలవుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ప్రతిఫలానికి అర్హులవుతాము. మన పాఠశాలలను రక్షించుకున్న వారమవుతాము, మన గ్రామ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించిన వారమవుతాము. అలాగే పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ మార్గనిర్దేశకం చేసిన వారమవుతాము. ఇవన్నీ జరగాలంటే ముందు గ్రామ పంచాయితీ పరిధిలో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసుకొని ప్రైవేటు విద్యను బహిష్కరిస్తూ, అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరు సహకరించుకుంటూ అలాంటి విద్యనే పొందడానికి వీలవుతుంది. కానీ ఈ విషయంలో గ్రామ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కమిటీలు వేసుకొని, ప్రతి ఒక్కరినీ మమేకం చేస్తూ, వీలైతే ప్రభుత్వ సహకారాలు, చందాలు, గ్రామ పంచాయితీ నిధుల నుండి కొంత సొమ్మును, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మరికొంత సొమ్మును వసూలుచేస్తూ వాటి నిర్వహణ బాధ్యతలను ఒక ప్రత్యేక కమిటీకి అప్పజెప్పి ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉంటే సాధ్యంగాని విషయమేమి కాదు.
గ్రామంలోనున్న ధనవంతులు, ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడన్నా చదువుకోని అది మనకవసరం లేదు. దారిద్య్రరేఖకు దిగువనున్న పేద ప్రజలు వారి పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అలాంటి విద్య అందాలంటే ఉమ్మడిగా కూర్చొని ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే జరగని పనంటూ ఉండదు. ఈ విషయంలో గ్రామ ప్రథమపౌరుడు కీలకంగా మారితే చరిత్ర పుటలలో తనకంటూ ఒక పేజీని పొందడానికి వీలవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం - మన పిల్లలకు బంగారు భవిష్యత్ నిద్దాం.

-డా. పోలం సైదులు