సబ్ ఫీచర్

ఆందోళనలతో అభివృద్ధి అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచీ ప్రతిపక్షం ఏదో రకమైన ఆందోళనలను చేస్తున్నది. రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కల్పిస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికీ ఏవో ఆరోపణలతో అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీలోనూ, ప్రతిపక్షం, ప్రభుత్వపక్షమూ సహనాన్ని కోల్పోయి వ్యక్తిగత విమర్శలతో, దూషణలతో చర్చలు సాగనివ్వడం లేదు.
ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా తమ డిమాండ్లను పెడుతూనే వున్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందవలసిన ఈ సమయంలో కూడా తమ సౌకర్యాలకోసం డిమాండు చేస్తున్నారే కాని, ఎక్కువ పనిచేయడానికి సహకరించడం లేదు. ఉద్యోగుల్ని ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికెళ్లాలి. హైదరాబాదునుండి అమరావతికి రావడానికిప్పటికే రెండు సంవత్సరాల టైమివ్వబడింది. అయినా, అనేక సాకులు చెప్పి, అడిగినవన్నీ ఇప్పించుకుని ఇప్పటికి కదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులంతా వారానికి ఆరు రోజుల పనిచేస్తారు. కాని హైదరాబాదు నుండి వచ్చే ఉద్యోగులు అయిదు రోజులే చేస్తామన్నారు. ముఖ్యమంత్రి అందుకంగీకరించారు. ఇంటి అద్దె అలవెన్సు పెంచాలన్నారు. ప్రభుత్వం 30 శాతానికి పెంచింది. వారానికి అయిదు రోజుల పని మాత్రమే అయినందువలన, సంవత్సరానికి 50 రోజుల పని తగ్గిపోతుంది. అంటే 50రోజుల ఉత్పాదక సామర్థ్యం (ప్రొడక్టివిటీ) తగ్గిపోతున్నది. ప్రతిపక్షాల్లో వున్న ఏ రాజకీయ పార్టీ ఇది తప్పని అనడం లేదు. ఎందుకంటే, ప్రభుత్వ పార్టీతో సహా అన్ని పార్టీల దృష్టీ ఉద్యోగుల ఓట్లమీదే! ఇది రాష్ట్ర ప్రజలను నష్టపరచడమేనన్న విషయాన్ని ఎవ రూ నొక్కి చెప్పడంలేదు. ఇతర ప్రభుత్వోద్యోగులు ఎక్కడకు బదిలీచేస్తే అక్కడికి వెళ్ళడం లేదా? మరి వీరి ప్రత్యేకతేంటి?
కొందరు నాయకులు కుల సంఘాలనూ, వర్గాలనూ ఏర్పరచి ఆయా వర్గాల ప్రజలకు ఆశలు కల్పించి ఆందోళనలు, అల్లర్లూ జరిపిస్తున్నారు. ఈ అలజడులనూ, అల్లర్లనూ సద్దుమణిగించడానికి ప్రభుత్వ యంత్రాంగమంతా అదే పనిమీదుండవలసి వస్తోన్నది. ముఖ్యమంత్రి నుండి, మంత్రులవరకూ కూడా అదే పనిమీదుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలూ అలాంటి అలజడులను సమర్ధిస్తున్నారు. వీరెవరికీ సాధారణ ప్రజలు గుర్తుకురావడం లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రజల చర్చలు, ఆలోచనలూ కూడా ఈ సంఘటనల చుట్టూనే జరుగుతున్నాయి. ఒక వర్గానికి అసాధారణ రాయితీలు కల్పిస్తే, మరో వర్గం కూడా అవి తమకూ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. ఏకజాతి భావం అందరిలోనూ ఎప్పుడో తొలగిపోయింది.
ఒకవైపు రాష్ట్ర విభజనకు కాంగ్రెసుతోపాటు కారణమైన బి.జె.పి. ప్రభుత్వం అభివృద్ధి ప్రయత్నాల్లో ఆదుకోడానికి బదులు, నిశ్శబ్ద నిరాకరణ చేస్తున్నది. ఆంధ్రా విషయంలో కేంద్రం సమాఖ్య ధర్మాన్ని పాటించడం లేదు. కొన్ని వేల కోట్లు పన్నుల రూపంలో రాష్ట్రంనుండి కేంద్రానికి వెళుతున్నది. అయినా కూడా, రాష్ట్రానికి బిక్ష వేస్తున్న విధంగా నిధులను విదిలిస్తున్నారు.
ముఖ్యమంత్రి రాష్ట్భ్రావృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కాని, ఆయన ప్రయత్నాలు కొన్ని ప్రణాళికాబద్ధంగా వుండడం లేదు. ఆచరణకు సాధ్యంకాని విధంగా వుంటున్నాయ. రాజధానిని వెంటనే నిర్మించాలి. లేకపోతే బైటనుండి పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులు రావు. అయితే, ఏది ముందో, ఏది వెనుకో అనే ప్రణాళిక వుండాలి. ఆరంభంలోనే ప్రపంచంలోకే గొప్ప రాజధానిని నిర్మించాలనుకోవడం అభివృద్ధికి ఆటంకమవుతుంది. పాలనావ్యవస్థ, ఇతర సదుపాయాల కల్పనకూ పనిచేయడానికి అవసరమైన రాజధాని ప్రస్తుతానికి చాలు. దీర్ఘకాల ప్రణాళికను రూపొందించుకుని, యాభై అరవై ఏళ్ళలో గొప్ప రాజధానిని తయారుచేసుకోవచ్చు. ఉచితాలతోనూ, మాఫీలతోనూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నది. ఏ వర్గంవారు ఎక్కువ వత్తిడి చేయగలిగితే, ఆ వర్గాలవారికి అనేక ఉచితాలు, రాయితీలూ ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలోని ఆదాయమంతా ఎవరిది? అయిదున్నర కోట్ల మంది ప్రజలకు చెందుతుంది! కొందరికే పంచేస్తే, మిగిలిన వర్గాల ప్రజలేం కావాలి? ఆర్థిక నిర్వహణ చాలా అశాస్ర్తియంగా జరుగుతున్నది. అది అశాస్ర్తియంగా నిర్వహించబడుతున్నపుడు, ఏ రాష్ట్రంకాని, ఏ దేశంకాని అభివృద్ధి చెందలేవు. ఆర్థిక నిర్వహణలో రాజకీయం పనికిరాదు. ఈ విషయాలను గుర్తుచేసినా ప్రయోజనముండదని, ఆర్థిక నిపుణులు మాట్లాడక ఊరుకుంటున్నారు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రజలంతా, నడిపే నాయకుడు లేక జరుగుతున్న దాన్ని చూస్తూ వుండిపోతున్నారు. ఇలాగే జరిగిపోతే రాష్ట్భ్రావృద్ధి జరగదు సరికదా, భవిష్యత్తు తరం వారికి వెనుకబాటుతనం, ఆత్మన్యూనతా వారసత్వంగా మిగులుతాయి. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగ దళాలు, కుల వర్గ నాయకులూ అంతరవైరంతో ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రజలే నిర్ణయాధికారులుగా ఎదగాలి! ప్రజల చైతన్య స్థాయినిబట్టి, ప్రజలెలాంటి వారైతే, వారికి అలాంటి ప్రభుత్వమే దక్కుతుంది!

- మనె్న సత్యనారాయణ