సబ్ ఫీచర్

ఉమ్మడి పౌరస్మృతి అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల మొదటివారంలో కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు 102వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ,‘రాజేశ్వరరావు జాతి సమైక్యతకోసం పాటుపడ్డారని, కాని ఇప్పుడు జాతీయ ఐక్యతకు, మతోన్మాద శక్తుల వల్ల ప్రమాదమున్నది’ అంటూ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలను నిందించారు. అంతేకాదు మోదీ కామన్ సివిల్‌కోడ్ తెచ్చేందుకు, ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణ రద్దుకు యత్నిస్తారని, అందువల్ల దేశంలో సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కలిగించే వార్త. కాని వాస్తవాలను పరిశీలిస్తే..రాజ్యాంగంలోని 44వ అధికరణం దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి సివిల్‌కోడ్‌ను అమలు జరపాలని ఆదేశించింది. అప్పటికి హిందువులలో బహుభార్యాత్వముండేది. దాన్ని చట్టరీత్యా ఎన్నడో నిషేధించారు. కానీ ముస్లింల విషయంలో ఎవరూ ఇంతవరకు మాట్లాడలా.
తమ మతాచారం ప్రకారం ముస్లింలు ఏకకాలంలో నలుగురు భార్యలను కలిగివుండవచ్చు. అందువల్ల వారి జనాభా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంది. పాకిస్తాన్ దేశ విభజన ఎలా జరిగింది? ముస్లింలు అధిక సంఖ్యాకులై తాము హిందువులతో కలిసి ఉండబోమని, తమకు ప్రత్యేక దేశం కావాలని, తాము మెజారిటీగా ఉన్న రాష్ట్రాలను కలిపి స్వతంత్ర దేశంగా విడదీయమని కోరారు. మన నాయకులు అంగీకరించారు. మరి పెరుగుతున్న ముస్లిం జనాభా నేపథ్యంలో 1947 మాదిరి పరిస్థితి పునరావృత్తం కాదని జైపాల్ రెడ్డి హామీ ఇవ్వగలరా?
పైగా తలాక్ అని మూడుసార్లు ఉచ్ఛరిస్తే భర్త భార్యకు విడాకులిచ్చినట్టే. హిందువుల మాదిరిగా వారు ఏ న్యాయస్థానానికి వెళ్లనవసరం లేదు. అసలు 21వ శతాబ్దంలో ఉండాల్సిన నిబంధనేనా ఇది? ఈ అనాగరిక పద్ధతిని పాకిస్తాన్‌తో సహా 22 ఇస్లామిక్ దేశాలు నిషేధించాయి. మనదేశంలోని ముస్లిం మహిళలు ఈ ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అనేకమంది ముస్లిం మహిళలు న్యాయస్థానాలను ఆశ్రయించి తీర్పుకోసం ఎదురుచూస్తున్నారు. మరి జైపాల్ రెడ్డిగారి ఉద్దేశం ‘కామన్ సివిల్‌కోడ్’ను అమలు పరచడం ద్రోహమనా?
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన మిత్రుడైన అబ్దుల్లాకోసం దేశహితాన్ని పక్కన పెట్టి కశ్మీర్ విషయంలో తప్పిదానికి పాల్పడ్డారు కదా. 1947లో వీరోచితంగా పోరాడుతూ, దురాక్రమణ దారులను తిప్పికొట్టి, కాశ్మీరు మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి మన సైన్యాలు ముందుకెళుతున్న తరుణంలో ‘స్వయంగా యుద్ధ విరమణ’ను ప్రకటించారు. మనకు ఖండిత కాశ్మీర్‌ను మిగిల్చారు. పైగా ఈ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లి, రావణకాష్టంలా రగిలేలా చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అనేక మంది మన సైనికులు అసువులు బాసారు. మరి ఈ రావణకాష్టాన్ని చల్లార్చి శాంతి సుస్థిరతలు తీసుకొని రావడానికి తీసుకునే చర్య దేశద్రోహం ఎట్లా అవుతుంది? మోదీ మీద కోపం ఈవిధంగా పరిణమిస్తుందా?
ప్రస్తుతం దేశంలో ఏవిధమైన ఉనికి లేని స్థాయికి కమ్యూనిస్టు పార్టీలు దిగజారాయి. ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న విషయంలో సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్‌ల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఎన్నివివాదాలున్నా రాబోయే కాలంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో కలిసి పనిచేయకమానరు. ఉనికికోసం ఇది తప్పదు కూడా. అయితే ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోని ‘ఇండియా దటీజ్ భారత్’ అన్న ప్రయోగం నుంచి ‘్భరత్’ను మినహాయించాలి. సెక్యులరిజం పేరుతో అయినదానికి కానిదానికి హిందువులను లక్ష్యం చేయకూడదు. హిందువులే అంతటి కఠిన వ్యవహారశైలి కలిగి ఉంటే, దేశంలో ఇన్ని మతాల వారిమధ్య సామరస్యత పరిఢవిల్లేది కాదు కదా!

- చాణక్య