సబ్ ఫీచర్
దటీజ్.. సామ్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నవ్వును నటించొచ్చేమోగానీ, నవ్వులో నటించలేం అంటాడో రచయిత. ఇక్కడ సమంతను చూస్తే అలానే అనిపిస్తోంది కదూ. మనసు ఆనందంగా ఉన్నపుడు నవ్వు స్వచ్ఛంగానే ఉంటుంది. అందంగా నవ్వుతున్న సమంత ఎంత ఆనందంగా ఉందన్నది ఇక్కడ పాయింట్ కాదు, అలా ఉండటానికి ఈ బ్యూటీ ఏం చేస్తుందా అని. ‘ప్రతి మొదటి పనికీ కొన్ని భయాలుంటాయి. ఇబ్బందులుంటాయి. అంతమాత్రానే అక్కడే ఆగిపోతే -ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం. అందుకే భయపడతాను. ఇబ్బందులూ ఎదుర్కొంటాను. కానీ సవాలను స్వీకరించకుండా ఉండను’ అంటోంది సమంత. బహుశ ఇటువంటి చాలెంజ్‌లే ఆమె అందంలోని మాధుర్యం అయివుండొచ్చు. ఇదంతా ఎందుకంటే -పెళ్లైన తరువాత కూడా ప్రయోగాలు ఆపకుండా పరుగులు పెడుతున్న సమంత మరో కొత్త చాలెంజ్‌ను స్వీకరించబోతోందట. అదే -కొత్త ప్రాజెక్టుకు మానసికంగా సిద్ధమవుతోంది. ఈ కథలో తన కెరీర్‌లోనే ఇప్పటివరకూ చేయనటువంటి చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నానన్నది సమంత చిర్నవ్వులోని అంతరార్థం. ఎంత బిజీగావున్నా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులోవుండే సమంతా ఇదే విషయాన్ని ఓ ట్వీట్‌గా చెబుతూ -‘నావరకు శక్తివంతమైన పాత్రలు చేశాను. ఇప్పుడు నాకే ఆసక్తికరం అనిపించే పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నా. కథ, అందులోని నా పాత్ర తీరుతెన్నులు చెప్పినపుడు నిజంగా భయమేసింది. కాస్త ఇబ్బందిపడ్డాను కూడా. బట్, ఇట్స్ ఏ సవాల్. స్వీకరించకుండా ఉండలేకపోయా. మన శక్తి మనకు తెలియాలంటే -ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు. అడుగు ముందుకేయాలి. ఇప్పుడదే చేయబోతున్నా’ అన్నది ట్వీ(స్వీ)ట్ సారాంశం.
మొనొచ్చిన ‘యూ-టర్న్’ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ దక్కకున్నా -సమంత భయపడలేదు. దర్శకుడు పవన్‌కుమార్ తెరకెక్కించిన చిత్రంలో తను చేసిన పాత్ర చాలా సంతృప్తినిచ్చిందనే చెప్పుకుంది. తాజాగా చేసిన ‘సూపర్ డీలక్స్’ చిత్రం విడుదలకు సిద్ధవౌతుంటే, ప్రస్తుతం ‘మజిలీ’ చిత్రంతో బిజీగా ఉంది. లవర్ హజ్బెండ్ చైతూతో కలిసి చేస్తున్న తొలి సినిమా ‘మజిలీ’ ఇది. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది పూరె్తైన వెంటనే -నందినిరెడ్డితో మరో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ చిత్రంలో ‘గ్రాండ్‌మదర్’ పాత్రలోనూ శామ్ కనిపించడానికి సిద్ధమైందన్నది ఇండస్ట్రీ టాక్. మరో ప్రాజెక్టులో డీగ్లామర్‌లో కనిపించే కరాటే పిల్ల పాత్రలోనూ కనిపించబోతోందట. ఇవన్నీ ఒకెత్తు -తాజాగా ఒప్పుకున్న ప్రాజెక్టు మరో ఎత్తు అన్నది సామ్ ట్వీట్ మాట. ఇప్పుడర్థమైందిగా ఆమె గట్సే -ఆ బ్యూటీకి కారణమని. సామ్.. ఓ ఇన్‌స్పిరేషనల్ సెలబ్రిటీ అనుకోవచ్చు. కాదంటారా?