సబ్ ఫీచర్
రాజకీయ... కథానాయకులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం రాజకీయం కూడా వేడెక్కింది. దేశంలొని కొన్ని రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో డిసెంబర్‌లో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ నాయకులూ ఎవరి ప్రచారంలో వాళ్ళు బిజీ అయపోయారు. ఇప్పటికే నువ్వా నేనా తరహాలో ప్రచారం కావిస్తున్నారు. ఇక మహా కూటమి ఎన్నికల లిస్ట్ ప్రకటించిందంటే.. ఈ ప్రచారం మరింత రంజుగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అన్ని పార్టీలు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ గద్దెనెక్కేందుకు వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయ. ఈ రాజకీయాన్ని కాసేపు పక్కన పెడితే -సినిమా రాజకీయాలూ ఊపందుకుంటున్నాయ. సినిమాల్లోనూ రాజకీయ నేపథ్యంలో సినిమాలు రూపొందుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
నిజానికి సినిమా, రాజకీయం రెండింటికీ ఉండే క్రేజే వేరు. కానీ ఎవరి దారి వారిదే.. ఈ రెండు రంగాలను కలిపే పొలిటికల్ డ్రామా సినిమాలంటే ప్రేక్షకులకు కాస్త ఆసక్తి ఎక్కువే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు తెలుగులో మాత్రం అరుదని చెప్పాలి. ప్రస్తుతం పొలిటికల్ డ్రామా జోనర్ సినిమాలు వరుసపెట్టి థియేటర్స్ వద్దకు క్యూ కడుతున్నాయి. మరి ఏ పొలిటికల్ సినిమా ప్రేక్షకులను ఎంత ఎంటర్‌టైన్ చేస్తుందన్నది విడుదలైతేగానీ చెప్పలేం. ఒక్కసారి ఆ పొలిటికల్ సిత్రాలు, వాటికోసం తెగ శ్రమిస్తున్న హీరోల పరిస్థితిపై ఓ లుక్కేద్దాం.
పొలిటికల్ నేపథ్యంలోని సినిమాలను ప్రస్తావించాల్సి వస్తే -ముందుగా గుర్తుకొచ్చేది అర్జున్ ఒకే ఒక్కడు చిత్రం. ఒకరోజు ముఖ్యమంత్రి కథతో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం అందుకుంది. అంతకుముందూ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలే వచ్చాయ. అచ్చంగా రాజకీయ సెటైర్‌తోనూ సినిమాలొచ్చాయ. అలాగే ఎన్నికల సీజన్‌లో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకూ ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయ. కానీ, అటు కమర్షియల్‌గా, ఇటు ఆధునిక రాజకీయ చిత్రంగా ట్రెండ్ సెట్ చేసింది మాత్రం -ఒకే ఒక్కడు. ఈమధ్యే సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వచ్చిన ‘్భరత్ అనే నేను’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. మహేష్- కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా టాలీవుడ్‌లో మళ్ళీ పొలిటికల్ జోనర్‌ల హవా పెంచింది. యంగ్ చీఫ్ మినిస్టర్ అవతారమెత్తిన మహేష్ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. కొరటాల తనదైన సన్నివేశాలతో అదరగొట్టేసాడు. మొత్తానికి పొలిటికల్ జోనర్‌లో సినిమా చేయాలనుకున్న మహేష్ కోరిక ‘్భరత్ అనే నేను’తో తీరింది. ఇక అర్జున్‌రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్న టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ కూడా కెరీర్ బిగినింగ్‌లోనే పొలిటికల్ కథను ఎంచుకుని గొప్ప ధైర్యం చేసాడు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన నోటా భారీ అంచనాలమధ్య విడుదలైనా ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఎంటర్‌టైన్ చేసాడు విజయ్. ఇక ఈ ఏడాది చివరినుండి జనవరి వరకు చూసుకుంటే మరిన్ని పొలిటికల్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయ.
వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ బయోపిక్. ‘మహానాయకుడు, కథానాయకుడు’ పేరిట రెండు భాగాలుగా వస్తున్న ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఒక భాగం పూర్తిగా రాజకీయ నేపథ్యాన్ని చూపించేందుకే కేటాయంచారు. నందమూరి తారక రామారావు కథతో పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2గా వస్తున్న చిత్రంలో అప్పటి రాజకీయ పరిస్థితులను కళ్ళముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాలయ్య తారక రామారావుగా నటిస్తున్న ఈ సినిమాలో రానా చంద్రబాబునాయుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకోసం అటు నందమూరి అభిమానులతోపాటు సినిమా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానుంది.
దాంతోపాటు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తున్న చిత్రం యాత్ర. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీ హీరోగా నటిస్తున్న సినిమాను వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకుడు. దాంతోపాటు 1996లో కమల్- శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘్భరతీయుడు’. దాదాపు 20 ఏళ్ళ తరువాత దానికి సీక్వెల్ చేసేందుకు సిద్ధమయ్యారు. రజనీకాంత్ రోబోకు సీక్వెల్‌గా వస్తున్న 2.ఓలో కమల్‌ను విలన్ పాత్రకు శంకర్ ఎంపిక చేసుకున్నాడు. అయతే, భారతీయుడికి సీక్వెల్‌పైనే కమల్ ఆసక్తి చూపడంతో చివరి క్షణంలో అక్షయ్‌కుమార్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. సో... రోబో సీక్వెల్ విడుదలైన వెంటనే భారతీయుడు -2 చిత్రం తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన శంకర్ కమల్‌హాసన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. కేవలం పాటిటిక్స్‌ను టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ రూపొందించారని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయ. తెలుగుకు సంబంధించి పొలిటికల్ డ్రామా నేపథ్యం సినిమాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్ కూడా మరో పొలిటికల్ యాక్షన్ డ్రామాతో రెడీ అవుతున్నాడు. ‘ఆపరేషన్ 2019’ బివేర్ ఆఫ్ పబ్లిక్... అనేది ఉప శీర్షిక. కరణం బాబ్జీ డైరెక్షన్ తెరకెక్కిన సినిమాలో మంచు మనోజ్, సునీల్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది. దాంతోపాటు తమిళంలో హీరో విజయ్- మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న సర్కార్ కూడా పక్కా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఈ నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం -ప్రస్తుత రాజకీయాలను వేడెక్కించేదే అని చెబుతున్నారు. దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథతో తెలంగాణ దేవుడు అన్న సినిమా కూడా రూపొందుతుంది.. అలాగే సంచలన దర్శకుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తుండగా.. చంద్రోదయం పేరుతో.. చంద్రబాబు బయోపిక్ కూడా మరోవైపు సిద్ధం అవుతుంది. అదే లిస్ట్‌లో మరిన్ని సినిమాలు సిద్ధం అవుతున్నాయి.