సబ్ ఫీచర్

నచ్చిన పనితోనే సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఏ పత్రిక తిరగేసినా వృద్ధుల దైన్యస్థితి పిల్లల నిరాదరణ వంటి అంశాల మీద కథలు, వ్యాసాలు వస్తూ ఉన్నాయి. ఉదయం పూచిన పూవు సాయంకాలానికి వాడిపోవటం ఎంత సహజమో వృద్ధాప్యం కూడా అంతే. మరీ మంచాన పడి తమ పనులుకూడా తాము చేసుకోలేని వారిని మినహాయించి కొన్ని వర్గాలుగా వృద్ధులను విభజించవచ్చు. 1. ప్రభుత్వ ఉద్యోగులు. వీరు సర్వీసులో తీసుకొన్న జీతానికి రెండింతల పెన్షను పొందుతూ ఉంటారు. పిల్లాజెల్లలు స్థిరపడే ఉంటారు (చాలావరకు). బి.పి, షుగర్లు, కళ్ళు, పళ్ళు, కాళ్ళు, కీళ్ళ చెవుడు వంటి బాధలు అన్నివర్గాల వారికి సమానమే అయినా ప్రభుత్వోద్యోగి అయితే ఉచిత వైద్యమో, రీయంబర్స్‌మెంట్ సౌకర్యాలు ఉంటాయి. 2. శ్రామికవర్గం వృద్ధులు జీవితాంతం శ్రమించే పొట్టపోసుకోవాలి. నిజమైన వృద్ధాప్య బాధితులంటే వీరే. 3. సంపన్న వర్గాలవారి వృద్ధులకు 90 ఏళ్ళు దాటిపోయిన చావుకు దగ్గర పడ్డామన్న వైరాగ్యభావమే కలదు. అన్నీ డబ్బుతోనే కొనేయవచ్చని అపోహతో ఉంటారు. ఏమాత్రం అనారోగ్య చిహ్నం కనబడ్డా ఎకాఎకీ ఐసియూలలో పెట్టేస్తారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ఈ బంగారు పిచికలే ఈ మహరాజ పోషకులు.
స్పందనలో తేడాలున్నా ఇలా ఏ వర్గాన్నిచూచినా వృద్ధాప్యం, జబ్బులు, మరణం అతి సామాన్యమైన అంశాలే. యువతరం పట్టించుకోవటం లేదన్నదే అన్నివర్గాలవారి ఆరోపణ. పుట్ట్టుగుడ్డిలాగా వృద్ధులందరూ పుట్టుకతోనే వృద్ధులు కాదుకదా! అన్నిదశలు దాటే వృద్ధాప్యంలోనికి అడుగుపెడతాం. శైశవము, బాల్యము చూచేవారికి అందమట. ప్రాయంవస్తే పంది పిల్లయినా అందగత్తేనట. అలాటి వనం వనకొస్తే! మనకుమనమే అందంగా కనబడతాము. ఇక వృద్ధాప్యం చూసేవారికి మనకుకూడా రోతనే. మనంమాత్రం ప్రాయంలో ఉండగా ముసలి తల్లిదండ్రులనో లేదా ఇంకా వృద్ధులనో చూచి మన పనులు మానుకొని వారిచుట్టే చేరి చెక్క్భజనలు చేశామా? మనకు తీరుబడి ఉన్నప్పుడో లేదా తోచినప్పుడెప్పుడో వారిని పరామర్శించి ఉంటామన్న స్పృహ ఎందరికుంది? ఇప్పుడున్నన్ని వ్యాపకాలు అప్పట్లోలేవు. పైగా ఉమ్మడి కుటుంబాలు ఉండటం చేత బయటికి వెళ్ళగలిగే అవకాశాలు తక్కువ. నేటి యువత భార్యాభర్తలిద్దరూ సంపాదనాపరులుగా ఉండటానికే యిష్టపడుతున్నారు. మన పిల్లలకు సహాయం చేయాలి తప్ప సూటిపోటి మాటలతో వారిని బాధించరాదు. మనకు అవకాశం ఉంటే మన పిల్లల ఇబ్బందులను గమనించి స్వచ్ఛందంగా వృద్ధాశ్రమంలో చేరితే నష్టమేమీలేదు. మన సంప్రాదయంలోకూడా నాలుగు ఆశ్రమముల్లో వానప్రస్థము అన్నది ఉన్నది. అంటే ఒకదశకు చేరిన తర్వాత తామరాకుమీద నీటి బొట్టులాగా సంసార బంధనాలకు కట్టుబడకుండా జీవించగలిగే స్థితి. మన పిల్లలు పెద్దవారయ్యారన్న ఆలోచనే మనకు రాదు. కాకి గూటిలోని కోయిల పిల్లలకు కూత వచ్చాక కాకికి పరాయివే! మన పిల్లలు మనకంతే. ప్రతి చిన్న విషయానికి అక్కర్లేని సలహాలిస్తూనో, లేదా వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనో, మన రోగాలు ఏకరువుపెడుతూ చీటికి మాటికి చీరాకు పెడుతూ ఉంటే సహజంగానే మనల్ని చూడగానే చిరాకు పుడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి?
వ్వనంలో ఉండగా వన పిల్లల సౌఖ్యం తప్ప వారినుంచి ఏమీ ఆశించం. ఇప్పుడూ అంతే నిష్కల్మషంగా మన పిల్లల సౌఖ్యంకోసం ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుంటే ఒకరినుంచి ఒకరికి ఇబ్బందులురావు. పిత్రార్జితం లేనివారు ఏవో ఇబ్బందులుపడి తమకు సౌకర్యంగా ఉండేచోట ఒక యిల్లు ఏర్పరచుకొని ఉండవచ్చు. అక్కడ మనం లేనప్పుడు ఏనాటికైనా అమ్మేదేకనా ఈనాడే అమ్ముదామంటారు పిల్లలు. అది అమ్మడం ఇష్టంలేని మనం ఆ యింటికోసం పడ్డ శ్రమను మెరుగులద్ది చెబుతాయే తప్ప ఈ ప్రపంచమే మనదికానప్పుడు ఈ యిల్లు మన వెంట వస్తుందా అని ఆలోచించం. శ్రీశ్రీశ్రీ శంకర భగవత్పాదులవారు చెప్పిన ‘‘జగన్మిథ్య’’అన్నది ఇదే. ఈ జగత్తు మనం లేనప్పుడు ఉన్నది. మనం ఉన్నప్పుడూ ఉంటుంది. మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఇదొక భ్రాంతి మాత్రమేనన్నది వారి హెచ్చరిక. అలాగని అన్ని వదులుకొని ముక్కుమూసికొని తపస్సు చేసుకోవలసిన పనిలేదు. నచ్చిన పనిచేసుకుంటూ వచ్చిన కష్టసుఖాలను అనుభవిస్తూ జీవితాన్ని వెళ్ళదీస్తే తనువు ముసలిదైనా మనసు నిత్యనూతనంగానే ఉంటుంది.

- ఆయి కమలమ్మ