సబ్ ఫీచర్

గురజాడ గృహ ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాడ అప్పారావుగారు విజయనగరంలో మొదట మాదన్నపేటలో ఓ పురాతన భవనంలో ఉండేవారు. అక్కడే ఆయన ఎంతగానో అభిమానించే తమ్ముడు శ్యామలరావు మరణించారు. గురజాడ ఎంతో దిగులు చెందారు. తమ్ముడు మద్రాస్‌లో ‘లా’ చదువుతూ ఇంటికి వచ్చిన తరువాత మరణించారు. అంతేకాదు ఒకరోజు ఆ ఇంటి పెంకులు ఊడి మంచంమీద పడ్డాయి. దాంతో గురజాడ వారి భార్య లక్ష్మీనరసమ్మగారు ఇల్లు మార్చాలని పట్టుబట్టారు. గురజాడకి కూడా ఇల్లు మారితే మంచిదనిపించింది. అప్పుడు ఆనందగజపతి రాజావారు పన్నులు వసూలు చేసే ఠాణాని గురజాడ వారికి 1891లో నివాసగృహంగా ఇచ్చారు. అప్పారావుగారి రచనా వ్యాసంగమంతా ఆ ఇంట్లోనే సాగింది. ఇప్పటికి ఆ ఇంట్లో పైనున్నగదిలో ఆయన వాడిన టేబుల్, కుర్చీ, కళ్లజోడు, రబ్బర్‌స్టాంప్ వంటి వాటితోబాటు ఆయన స్వంత లైబ్రరీ ఉంది. మరణించేవరకు ఆయన ఆ ఇంట్లోనే ఉన్నారు.ఆ ఇంటికి పడమరవైపు పెరడుండేది. ఆ పెరట్లో గురజాడవారు కొత్త ఇల్లు కట్టించుకున్నారు. ఆప్పటికే ఆరోగ్యం పూర్తిగా పాడవడంతో కొడుకు, కోడల్ని గృహప్రవేశం చేయమన్నారు. ఆ ఇంట్లోకి కాలుపెట్టకుండా అంతకుముందున్న ఇంట్లోనే కన్నుమూసారు. ఆయన ఉన్న ఇంటినీ, ఆయన వంశీకులకు నామమాత్ర చెల్లింపుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అలా వదిలేసింది. ఇల్లు దెబ్బతింటుంటే సాహితీవేత్తలే చిన్నపాటి మరమ్మతులు చేయించారు. డాక్టర్ మూర్తిగారు చెదపట్టిన కిటికీలు, ద్వారాలు లాంటివి మార్చారు.
ఇప్పుడు జరుగుతున్న అసలు కథంతా గురజాడవారు కట్టించిన ఇంటి చుట్టూనే తిరుగుతోంది. గురజాడ వారికి చెందిన ఈ ఇంటినీ ప్రభుత్వం, నామమాత్ర ధరకు తీసుకుంటుందని భయపడ్డారో ఏమో, కొందరు తమ వాటాని ఓ బిల్డర్‌కు మంచి ధరకే అమ్మివేశారు. ఒక మునిమనమడు ప్రసాద్ మాత్రం తన భాగాన్ని అమ్ముకోక అక్కడే ఉండి ముత్తాతగారి ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీ వాటాని అమ్మేస్తే వేరేచోట సమాన విలువైన ఆస్తినిస్తామన్నారు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌వారు. ముత్తాతగారి మ్యూజియంకోసమే కదాని ప్రసాద్, ఇతరులు ఒప్పుకున్నారు. హఠాత్తుగా మున్సిపల్ కార్పొరేషన్ చొరబడి, గురజాడవారి మ్యూజియం నిర్మాణానికి అంగీకరించడం లేదు. వారి వంశీకులకు రెవెన్యూ విభాగం సూచించిన స్థలం ఇవ్వడానికి వీల్లేదని కౌన్సిల్‌లో నిర్ణయించారు. రెవెన్యూ విభాగానికి ఆ స్థలాన్ని వేరే ఉపయోగార్థం కేటాయించామని మున్సిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ చెప్పి, ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తే బాగుండేది. రెవెన్యూ అధికార్లు తమను సంప్రదించకపోవడం వల్ల తాము వ్యతిరేకించామంటూ మున్సిపల్ అధికార్లు చెప్పడంలో అర్థం లేదు. వాళ్లలో వాళ్లకి అవగాహన లేకుండా ఇలా ప్రకటించడం ఎంత అన్యాయం? తామిచ్చే స్థలానికి సమానమైన విలువైన స్థలాన్ని ఇవ్వాలంటూ గురజాడ వారి కుటుంబం అసమ్మతి ప్రకటించింది. అందర్నీ ఖాళీ చేయించిన భూమి గురజాడ మ్యూజియం కోసం కాకపోతే మరెందుకో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. గురజాడ వారి భూముల్ని వదలిపెట్టకుండా, చర్చల్లోకి లాగిన మున్సిపల్ కార్పొరేషన్ తీరును నిరసిస్తూ పలువులు తెలుగువారు ఇ-మెయిల్స్, ఫేస్‌బుక్‌ల ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఆధునిక యుగకర్తకు లభిస్తున్న ఆదరణ ఇది. సాహితీవేత్తలకన్నా ఈ అధికారులు ఎలా మిన్న? అధికారంలోనా?

-డా.వేదగిరి రాంబాబు సెల్: 9391343916