సబ్ ఫీచర్

ఆయన మరో కాళిదాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రేఖామాత్రం సానసహతి కిల్బిషం మానవానాన్’’-మానవుల్లోని మాలిన్యాన్ని ఆయన రేఖామాత్రం కూడా సహించజాలడు-అన్నది బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథ శర్మ దుర్వాసమహాముని గురిం చి చెప్పిన మాట. మాలిన్యమంటని జీవితాన్ని స్వయంగా నిర్వహించిన శాస్తవ్రిదుడు విశ్వనాథశర్మ..ఆయన సంస్కృత నిధి, తమ సంస్కృత భాషా మాధుర్య మహానది! ‘‘మామూ లు అర్థమునకు మల్లినాథుడు తన విశేష అర్థములకు విశ్వనాథుడు’’ అని ఆయన మిత్రులు, శిష్యులు చెప్పుకోవడం దశాబ్దుల సాహితీ వాస్తవం. మహాకవి, కాళిదాసు సంస్కృత సాహిత్య కులగురువు. ఆయన వంటి మహాకవి ఇంతవరకు మళ్లీ జన్మించలేదు. విశ్వనాథశర్మ కాళిదాసు కావ్యాలకు వ్యాఖ్యానం చెప్పిన తీరు, వివరించిన శైలి అనితర సాధ్యం. మల్లినాథసూరి, కాళిదాసు కావ్యాలకు శతాబ్దుల క్రితం వ్యాఖ్యానం రాశాడు. కాని మల్లినాథుడు వదిలిపెట్టిన విశేషాలను ఈనాటి రసజ్ఞులకు విందు చేయగలిగిన మరో మల్లినాథుడు విశ్వనాథశర్మ.
మహాకవి కాళిదాసు మళ్లీ విశ్వనాథుని రూపంలో జన్మించాడా అన్న సందేహాలకు ఆ మహాకవి గురించి ఆయన వివరించిన మహావిషయాలు సమాధానాలు. ‘‘శ్రుతే రివార్పం స్మృతిహిఅన్వగచ్ఛత్’’- వేదమార్గాన్ని స్మృతులు, శాస్త్రాలు అనుసరించాయని రఘువంశం మహాకావ్యంలో కాళిదాసు చెప్పిన మాటలకు ఆధునిక భాష్యం విశ్వనాథ శర్మ జీవన ప్రస్థానం.
మహాకవి కాళిదాసు జ్యోతిర్‌విధాభరణం అన్న జ్యోతిష విజ్ఞాన గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన మరో కాళిదాసు విశ్వనాథ శర్మ. ‘‘కలౌ పారాశరీ స్మృతాః’’ అన్నది ధర్మశాస్త్ర నిర్దేశం. కృతయుగంలో మనుధర్మశాస్త్రం ప్రమాణం కాగా కలియుగ పరాశర మహర్షి రచించిన ధర్మశాస్త్రం ప్రమాణం. పరాశరుడు కలియుగ ఆరంభంలో రచించిన ఈ స్మృతికి 700 ఏడ్లకు పూర్వం మాధవ విద్యారణ్యుడు భాష్యం రాశాడు. ఈ ‘‘పరాశరమాధవీయం’’ సంస్కృత గ్రంథాన్ని ఆంధ్రీకరించి తెలుగువారికి అందించిన అభినవ విద్యారణ్యుడు విశ్వనాథుడు...కర్నూలు జిల్లాలో గడివేముల పెసరవాయి గ్రామంలో జన్మించిన విశ్వనాథ శర్మ తిరుపతిలో విద్యనభ్యసించారు. పాలమూరు జిల్లాలో తమ జీవితంలో అధికభాగం గడిపారు. ఆయన ఆచార్యుడు, కళాశాల అధ్యక్షుడు, వేద సంస్కృత పండితుడు, వేల శిష్యులకు మార్గదర్శకుడు. వేంకట నరసమ్మ, వేంకట కృష్ణయ్య వారి తల్లిదండ్రులు. కొల్లాపూర్ సంస్థాన విద్వాంసుడు వనం సీతారామశాస్ర్తీ తెలకపల్లి వారికి ధార్మిక గురువు. క్రీస్తుశకం 1932 ఆంగిరస, ఆశ్వయుజ బహుళ సప్తమి నాడు ఆయన జన్మించారు..్భర్య, కుమారుడు, కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్లు, మనుమరాళ్లకే కాక శిష్యులందరికి ఆయన నిరంతర స్ఫూరికారకుడు, ప్రాతః స్మరణీయుడు.
స్మృతి రాహిత్యమే మృతి అని విశ్వనాథశర్మ పదేపదే చెప్పేవారు. అందువల్ల ధార్మిక స్మృతి కోల్పోరాదని ఆయన వివరించేవారు. వారి స్మృతులు వారి సాహితీ సాంస్కృతిక కృతులు మరపురానివి. అందువల్ల ఆయన స్మృతికి మరణంలేదు.

chitram తెలకపల్లి విశ్వనాథశర్మ

-హెబ్బార్ నాగేశ్వరరావు