సబ్ ఫీచర్

సేంద్రియ సేద్యమే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల తలరాతో, స్వయం తప్పిదమో వేల ఏళ్ల సహజ సిద్ధ జ్ఞానాన్ని, విత్తనాలను, సహజ సేంద్రీయ ఎరువుల్ని వదిలి వ్యవసాయ సాగును, పంట ఉత్పత్తిని భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తున్న రసాయనిక ఎరువుల వాడకంతో తొలుత కొంత ఉత్పాదన పెరిగినా రానురాను భూములు తమ సహజత్వాన్ని కోల్పోయి సారవంతమైన భూములు ఎడారిభూములవుతున్నాయని శాస్తవ్రేత్తలు విశే్లషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సారవంతమైన భూములు వ్యవసాయ ప్రమాదపు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అవసరానికి మించి వాడి వాణిజ్య పంటల్ని పండించడం ఒక దుస్థితి అయితే అవగాహనా రాహిత్యంతో భూముల్ని నిస్సారంగా మార్చడం మరో ప్రమాదకర పరిణామం. ఏప్రాంతం వారైనా వ్యవసాయ సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకుని సాగు విధానాలను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా వుంది. రసాయనిక ఎరువులతో పంట ఉత్పత్తిని ఒకటిరెండుసార్లు పెంచుకోవచ్చునేమో కానీ ఆ తర్వాత భూమి డొల్లబారి, నిస్సారమై ఉత్పత్తులనందించే స్వభావ సిద్ధమైన అర్హత కోల్పోతుందని వ్యవసాయ శాస్తవ్రేత్తలు మొత్తుకుంటున్నా రెండో ఆలోచనకు తావీయకుండా మూర్ఖంగా రైతులుసాగుచేయడం అర్ధరహితమే కాకుండా అనర్ధదాయకంగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
50 సంవత్సరాల క్రితం మొదలైన రసాయనిక వ్యవసాయం, వేల సంవత్సరాల పంట సాగు విజ్ఞానాన్ని, పంటలను విత్తనాలను చివరకు భూముల్ని కూడా నిస్సారంగా తయారుచేసింది. సేంద్రీయ సేద్యం చేతికి వచ్చిన పంటని ఒక సామెత ఉంది. భారత దేశంలో సేంద్రీయ ఎరువుల తయారీకి కావాల్సినన్ని వనరులు వున్నాయి. రైతులు పూనుకుని సంకల్పబలంతో ముందుకు వెడితే పచ్చిరొట్ట, పచ్చటి ఆకుల, రెమ్మలు, ఎండుటాకులు, వ్యర్థ పదార్ధాలను కుళ్లపెట్టడం, పశువుల విసర్జితాలు, చెరువులలో, కుంటలలో మేటవేసిన నల్లరేగడి మట్టి, ఇంకా అనేకానేక వ్యర్ధ పదార్ధాలను సేంద్రీయ ఎరువులుగా మార్చుకునే విధానం ఈనాటిది కాదు. రైతులకు మేలు చేస్తామని ప్రసంగాలు చేసే నాయకులు ఏనాడూ రైతుల కష్టనష్టాల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిజంగా ప్రభుత్వాలు, నాయకులు రైతుల దుస్థితికి మార్గానే్వషణ చేసివుంటే దేశంలో ఇంతపెద్ద ఎత్తున రైతులు బలవన్మరణాల పాలై వుండేవారు కాదు. నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో సైతం పదవతరగతి ఆపై బడి చదువుకున్న యువతకు ఏమాత్రం కొదవలేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు కొంత శాతం మంది వెళ్లినా గణనీయంగా ఎక్కువ శాతంమంది వ్యవసాయాన్ని నమ్ముకున్న యువకులున్నారు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలవారు పిలుపునిచ్చి వారికి వ్యవసాయపరమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చినా విద్యావంతులైన రైతుబిడ్డలు, ఆ పరిధిలో మరింత వ్యవసాయ విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకుని వ్యవసాయ రంగంలోకి దిగితే అద్భుత ఫలితాలను ఆవిష్కరించగలరు.
సేంద్రీయ వ్యవసాయంలో భూమిని సారవంతం చేయడమే కాకుండా అధికోత్పత్తిని సాధించేందుకు సులువైన మార్గం జీవామృతం. జీవామృతం, పంచగవ్య వంటి ద్రవరూప సేంద్రీయ ఎరువులపై బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనంతోపాటు ప్రామాణికతను సుస్థిరం చేసింది. సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలవల్ల మానవ దేహ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చడమే కాకుండా మనుషులు దృడంగా మనగలిగేవారు. రసాయనిక ఎరువులు వేసే పంటలకంటె సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చని వ్యవసాయ శాస్త్ర విశే్లషకులు ఘంటాపథంగా చెపుతున్నారు. ప్రకృతిపరమైన సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధిక నిధులను సమకూర్చి ప్రకృతి వ్యవసాయంపై శాస్తవ్రేత్తల ద్వారా రైతులకు ప్రేరణ కల్పించి ఆ వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించేలా చేయడం ప్రభుత్వ కర్తవ్యం.

-దాసరి కృష్ణారెడ్డి