సబ్ ఫీచర్

అవయవ దానంపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్ధనమూలం ఇదమ్ జగత్’’ అని మన పెద్దలు ఎందుకు చెప్పారో కాని, ప్రస్తుతం మన దేశంలో వైద్యానికి సంబంధించి మాత్రం ఈ నానుడి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. పేదరికంలో ఉన్న వారికి ఏదైనా జబ్బు వస్తే, వారికి చావు తప్పదనే భావన ప్రజలలో నెలకొని ఉంది. ఇందుకు కారణం పాలక పక్షాలు ఒక పథకం ప్రకారం, ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేయడమే. మన దేశంలో వైద్యరంగం ప్రభుత్వరంగంలో కన్న ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. అవయవ మార్పిడికి అవకాశం లేక మన దేశంలో సాలీనా వేలాది మంది మరణిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో గుండె, మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరి తిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. విశేషం ఏమిటంటే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలలో మన దేశంలో సక్సెస్ రేటు 96 శాతం కాగా, కాలేయం మార్పిడిలో 85 శాతం ఉంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాల కన్నా చాలా ఎక్కువ.
ప్రస్తుతం మన దేశంలో గుండె మార్పిడికి 15 నుంచి 30 లక్షలు, మూత్రపిండాల మార్పిడికి 5 నుంచి 10 లక్షలు, కాలేయం మార్పిడికి 20 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. అయితే ఇంత మొత్తాన్ని వెచ్చించి శస్త్ర చికిత్సలు చేయించుకొనే స్థోమత పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన దేశంలో సాలీనా 1.75 లక్షల మందికి మూత్రపిండాల మార్పిడి శస్తచ్రికిత్సలు చేయాల్సి ఉండగా, కేవలం ఐదువేల లోపు శస్తచ్రికిత్సలు మాత్రమే జరుగుతున్నాయి. కాలేయం మార్పిడి శస్త్ర చికిత్సలు లక్ష చేయాల్సి ఉండగా, వెయ్యి మాత్రమే జరుగుతున్నాయి. గత సంవత్సరం దేశవ్యాప్తంగా 20వేల మందికి ఊపిరి తిత్తుల మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించగా, కేవలం 37 మందికి మాత్రమే ఈ శస్త్ర చికిత్సలు చేశారు. అదే విధంగా 50వేల మందికి గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించగా, 110 మందికి మాత్రమే ఈ శస్త్ర చికిత్సలు జరిపారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు అందుబాటులో లేకపోవడం వలన పలువురు అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. మన దేశం అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంలో వెనకబడి ఉండటానికి ప్రధాన కారణాలు ఆసుపత్రులలో సౌకర్యాల కొరత, అవయవ దానంకోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడమే. గత కొద్దికాలం అవయవమాదం పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి అటు ప్రభుత్వం ఇటు మీడియా చేస్తున్న ప్రచారం కారణంగా, వారిలో చైతన్యం వస్తున్నది. ప్రస్తుతం బ్రెయిన్‌డెడ్ కేసులలో అవయవ దానం జరుగుతున్నది. మన దేశంలో గుండె మార్పిడికి 32, మూత్ర పిండాల మార్పిడికి 153, కాలేయం మార్పిడికి 41, ఊపిరి తిత్తులు మార్పిడికి 9 ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. దాదాపుగా ఈ ఆసుపత్రులన్నీ ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహించబడుతున్నవే కావడం గమనార్హం. ఈ ఆసుపత్రులు అన్నీ మెట్రో నగరాలలో ఉన్నాయి.
బిహార్ రాష్ట్ర జనాభా సుమారు వంద మిలియన్‌లు కాగా ఈ రాష్ట్రంలో మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేసే ఆసుపత్రి ఒక్కటి కూడ లేదు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం పాట్నాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయడానికి అనుమతి ఇచ్చింది. అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలు ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్నా అవయవాలకోసం ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడడం గమనార్హం. మన దేశంలో అవయవ మార్పిడి శస్తచ్రికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలుత అవయవదానం పట్ల ప్రజలను చైతన్యపరచాలి. వైద్య కళాశాలలకు అనుబంధంగా కళాశాలల్లో మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి అనుమతించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్యులలో 15 శాతం మందికి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలపై శిక్షణ ఇవ్వాలి. దీనివలన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- పి.భార్గవరామ్