సబ్ ఫీచర్

ఇంటి కంపోస్టుతో నగరం శుభ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరం ఈ మట్టిలో కలసిపోవలసిందే, ముందు వెనుక అంతే, అనే మాటలు తరచు పెద్దల నోట వినిపిస్తుంటాయి. ఈ మాటలను పలు రకాలుగా వాడుతుంటారు. అవి ఎలా వున్నా నిజానికిది ప్రకృతి సహజ నియమం. జీవులన్నీ మట్టి నుండే పుడతాయి. చివరకు ఆ మట్టిలోనే కలసిపోతాయి. లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి చక్రం ఇలా తిరుగుతూ సహజ సమతుల్యతను కాపాడుకొంటుంది. నేలలో విత్తుకు నీరు, వాతావరణాలు సమపాళ్ళలో అందితే మొక్కగా మొలుస్తుంది.
కంపోస్టింగ్ అనే మాట జీవ శాస్త్ర సంబంధితమైంది. మట్టిలో కలసిపోదగిన వస్తువులన్నీ కుళ్ళిపోతాయి. కూరగాయలు, పండ్లు, గింజలు, పత్తి, వండిన ఆహారం, ఆకులు, కర్రలు ఈ కోవకు చెందిన సామగ్రి. వీటిలో సెల్యులోస్ వుంటుంది. మాంసం, జంతు సంబంధిత పదార్థాలూ చివికిపోతాయి. మనం ఈ ప్రక్రియకు సహకరిస్తే ప్రకృతి చక్రం సజావుగా సాగిపోతుంది. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం వలనే మనకీ చెత్త కష్టాలు. గ్రామీణ ప్రాంతాలను కలియ దిరిగితే మనకు ఆకులు, అలమలు సహజంగా కుళ్ళడం కనిపిస్తుంది. ఈ సహజ క్రియను మనం అంతగా ఇష్టపడం. ప్లాస్టిక్ పదార్థాలు, ఇతర చెత్తాచెదారాల మధ్య తిరుగాడే కంటే ఇది ఎంతో ఆరోగ్యకరం. గ్రామాల్లో అక్కడక్కడ జీవ సంబంధిత చెత్త మాగుతూ చెడు వాసన వెదజల్లుతూ, క్రిమి కీటకాలు ముసిరి వుంటాయి. కనుక కంపోస్టింగ్ రోగ కారకమనుకొంటాం. కాని ఇది నిజం కాదు. సాధారణంగా ఈ ప్రక్రియ క్రమ పద్ధతిలో జరుగుతుంది.
నగరాల్లో గుట్టలు గుట్టలుగా పోగుపడిన చెత్తాచెదారాలను చూచి నగరవాసులు మురికిని శుభ్రపరచడంపై మాట్లాడటానికే ఇష్టపడరు. ఏం చేయలేమని చేతులెత్తేస్తారు. ఇది అందరూ కలసి చేయవలసిన పని అని అభిప్రాయపడతారు. వ్యక్తిగత పరిష్కారానికి తావులేదనుకొంటారు. కాని దానికి ఇంటి దగ్గరే పరిష్కారం లభిస్తుంది. చివికిపోదగిన కూరగాయలు చెక్కు, మూడికలు, పండ్ల తొక్కలు, తినగా మిగిలిన ఆహార పదార్థాలు, చిత్తు కాగితాలను కంపోస్టుగా మార్చవచ్చు. మన ఇంటిని మాత్రమే అద్దంలా వుంచుకొని వ్యర్థాలను రోడ్లపై పారవేయడంవలనే నగరాలు మురికి కూపాలుగా మారిపోతున్నాయి. రోజుకు ఒక ఇంటి నుండి ఒకటి రెండు కేజిల వరకు చెత్త తయారౌతుంది. ఒక అంచనా ప్రకారం ఒక నగరంలో పోగుపడిన చెత్తలో 70 శాతం ఇళ్ళనుండే వస్తుందని లెక్కించారు. వేల టన్నుల కొద్ది తయారయ్యే చెత్తను శుభ్రపరచడం పారిశుద్ధ్య కార్మికులకు తలకు మించిన భారంగా మారింది. దీన్ని సక్రమంగా యాజమాన్యం కావించడం నగర పాలక సంస్థలకు తలనొప్పైంది. ఇంట్లో కంపోస్టు చేయడానికి పెద్ద స్థలం అవసరం లేదు. ఖాళీ మట్టి స్థలం వున్న ఇంట్లో నాలుగు చదరపు అడుగులు చాలు. చిన్న గోతిని తవ్వి ఒక చెత్త పొర, ఒక మట్టిపొర వేస్తే చెత్తనుండి అంతగా చెడు వాసన రాదు. ఇంటి డాబా పైన, అపార్ట్‌మెంట్‌లోనూ కంపోస్టు చేసుకోవచ్చు. రోజుకి ఒకటి, రెండు కిలోలు చెత్త వస్తుందని కంగారు పడక్కరలేదు. మూత వున్న రొంతి కుండల్లో కంపోస్టు చేయడం కొన్ని నగరాల్లో చిన్నగా మొదలైంది. జీవ సంబంధమైన వ్యర్థాలను క్రమపద్ధతిలో చివికించి సారవంతమైన మట్టిగా మార్చే క్రమమే కంపోస్టింగ్. ప్రత్యేకమైన మట్టి కుండలో అడుగుకి పలుచని పొరగా ఎండి ఆకులు నలిపి వేయాలి. దొరికితే కొబ్బరి పొట్టును వాడవచ్చు. దానిపై వంటింటి వ్యర్థాలు వేయాలి. బయోకమ్ అనే రసాయనం కేజి చెత్తకు ఒక గ్రాము వేయాలి. చెడు వాసన రాకుండా వుండేటందుకు సెనీట్రిట్‌ని వాడుకోవాలి. ఆఖరి పొరను ఆకులు లేదా కొబ్బరి పొట్టుతో వేయాలి. నాలుగు నుండి ఆరు వారాల్లో మంచి జీవన ఎరువు తయారౌతుంది. దీన్ని పూల మొక్కలకు, కూరగాయల మొక్కలకు వాడుకోవచ్చు. ప్రతి రోజు పది నిముషాలు చాలు ఈ పనికి. ప్రతి ఇంట కంపోస్టు తయారుచేస్తే నగరంలో పోగయ్యే 70 శాతం రోడ్డు చేరదు.
అలాగే మనం వస్తు వినియోగాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. కాగితం సంచుల్లో పప్పులు ఇతర వెచ్చాలను తెచ్చుకోవాలి. ఇంట్లో త్రాగునీటికోసం రాగి, ఇత్తడి, స్టీలు బిందెలు, పాత్రలు వినియోగించుకోవాలి. ఇలా కొంచం మన జీవన శైలిని మార్చుకొంటే నగరాలు, పట్టణాలు శుభ్రపడతాయి. ఇంటి కంపోస్టుపై నగర పాలక సంస్థలు ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

- వి.వరదరాజు