సబ్ ఫీచర్

తిరోగమనంలో విద్యావిధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఎన్నడూ లేని దుర్గతి నేటి ప్రాథమిక సెకండరీ విద్యలకు పట్టింది. ఈ తిరోగమన విధానమే ప్రైవేటు పాఠశాలల దినదినాభివృద్ధికి అవకాశం కల్గించింది. పూర్వం ప్రైవేటు పాఠశాలలు లేవు ఆనాడు పురపాలక సంఘాలు జిల్లా బోర్డులు ఎయిడెడ్ సంస్థలు పాఠశాలలు నిర్వహించేవి. ఆ పాఠశాలలన్నీ ప్రభుత్వ విధానాలు అమ లు జరిపేవి. ప్రభుత్వ ఉదాసీన విధానాలవలన 1970వ దశకం నుండి ప్రైవేటు పాశాలలు శరవేగంగా పెరిగి నేడు విశ్వరూపం దాల్చాయి. వీటి పోటీ తట్టుకోలేక క్రమంగా ప్రభుత్వం వాటి పద్ధతులు కాపీ చేయడం ప్రారంభించింది. పాఠశాలలకు కాని కాలేజీలకు కాని వెళ్ళే పిల్లలకు పూర్వం ఏకరూప దుస్తులు లేవు. ఈ పద్ధతి ప్రైవేటు పాఠశాలలు మొదలుపెట్టగా ప్రభుత్వం తమ పాఠశాలలో కూడా ఆ విధానం ప్రవేశపెట్టింది.
ఆనాడు పాఠశాలలకు వెళ్లే పిల్లలు సంచులతో పుస్తకాలు మోసుకుపోవడం ఎరుగరు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు కాలేజీ విద్యార్థులు పెద్ద సంచులతో పుస్తకాలు మోసుకుపోతున్నారు. వీటికితోడు టిఫిన్ బాక్సులు మంచినీళ్ల సీసాలు. ఈ విధంగా ప్రతి విద్యార్థికి భారం ఎక్కువయింది. ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలు పెంచి వేయడం వలన ప్రభుత్వం కూడా ఆ విధానం అనుకరిస్తున్నది. ఎందుకు ఇన్ని పుస్తకాలు? అవి అన్నీ ఆ రోజు ఉపయోగించడం సాధ్యమా? ఎన్ని ఎక్కువ పుస్తకాలుంటే అంత చదువు వస్తుందని ఒక తప్పు అభిప్రాయం ఏర్పడిపోయింది. భాషేతర సబ్జక్టులు అనగా గణితము సాంఘిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రాల తాలూకు పుస్తకాలు పాఠశాలకు తీసుకువెళ్లనవసరం లేదు. ఉపాధ్యాయులు ఆ పాఠాలు బోధనోపకరణాల ద్వారా బోధించాలి. ఇంగ్లీషు తెలుగు వంటి పుస్తకాలు తప్పక తీసుకువెళ్లాలి. ఆనాడు నోట్ బుక్స్ సంఖ్య కూడా పరిమితంగా ఉండేది. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకు ఇన్ని పుస్తకాలు?
సంవత్సరాంతం పిల్లల నోట్‌బుక్స్ పరిశీలించండి. వాటిలో అనేక తెల్ల కాగితాలు రూళ్ల కాగితాలు మిగిలిపోయ ఉంటాయ. నానాటికి దిగజారుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఏదో విధంగా పైకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. ప్రైవేటు పాఠశాలలు వార్షికోత్సవాలు నిర్వహించి బహుళ ప్రచారం చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటివి జరపడానికి తీరిక ఉండదు. దానికి కారణం ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు దాదాపు అందరు పొరుగూళ్లనుండి వచ్చి వెళ్లిపోతుంటారు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పాఠశాలలల్లోను విధిగా వార్షికోత్సవాలు జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఈ సందర్భంగా అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వపాఠశాలలు ప్రామాణికమైన విద్య అందిస్తాయని అందులో సందేహం లేదని ఉపన్యాసాలు చేస్తారు. ఏం లాభం? ఇవి ఏవీ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పనికిరావు. ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీషు మీడియమ్ ప్రారంభించాయి. ప్రభుత్వం కూడా ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలు ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలలు మూడు సంవత్సరాల వయసుగల పిల్లలను చేరుస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విధానం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు ప్రారంభించింది.
పాఠశాల ప్రగతికి మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి మేనేజిమెంటు. రెండు ఉపాధ్యాయుల సామర్థ్యం మూడు పర్యవేక్షణ. ఇప్పుడు ఈ మూడు ఆశించిన విధంగా లేవు. మండల వ్యవస్థ ప్రారంభం కాగానే విద్యాశాఖ ఉనికి కోల్పోయింది. మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు ఇప్పుడు స్థానిక సంస్థల క్రింద పనిచేయడం లేదు. పూర్వం వీరి నియామకాలు కూడా స్థానిక సంస్థలు చేసేవి ఇప్పుడా పద్ధతి పోయింది. ఇష్టారాజ్యం నియామకాలు ప్రమోషన్లు బదిలీలు మొదలైన వాటి విషయాల్లో అనేక వ్యాజ్యాలు సాగుతున్నాయి. తీర్పులు త్వరగా రావు. వచ్చినా అప్పీళ్లు. ఎందుకు ఈ గందరగోళం? దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలే. పరిపాలన వికేంద్రీకరణ అయినప్పుడు బలంగా ఉంటుంది.
ఇప్పుడు కేంద్రీకరణ అయింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రతి విషయంలోను ప్రైవేటు పాఠశాలలను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ప్రజలకు తెలిసిపోయింది. అందువలన అధికారులు రాజకీయ నాయకులు పదే పదే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి దీటుగా తయారుచేస్తామని చెబుతున్నారు. అదే నిజమైతే ప్రైవేటు పాఠశాలలు మూతపడిపోతాయి. ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాలవలన ప్రభుత్వ పాఠశాలలు బలపడలేదన్న విషయం తేలిపోయింది. పర్యవేక్షణా విధానం ఇప్పుడు లోపభూయిష్టంగా ఉంది. అది బలపడడానికి విద్యాశాఖ పటిష్టంగా ఉండాలి.
పూర్వం అనగా 1986వ సంవత్సరానికి ముందు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్లు ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేసేవారు. ప్రతి పాఠశాలకు సాలుసరి పరీక్ష తప్పక జరిగేది. ఆ సందర్భంగా విద్యాప్రమాణాలు వారు పరిశీలించి తగిన సూచనలు వ్రాత పూర్వకంగా చేసి అవి ఎంతవరకు అమలు జరిపినది తదుపరి విజిట్లలో పరిశీలించేవారు. ఇప్పుడా విధానం లేదు. ఉన్నత పాఠశాలల సంఖ్య ఎక్కువైనందువలన డిఇఓలకు సహాయంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లను నియమించారు. ఉన్నత పాఠశాలలకు కూడా సాలుసరి పరీక్ష తప్పనిసరిగా జరిగేది. వెనుకటి మాదిరిగా ఇవి కట్టుదిట్టంగా జరగడం లేదు. డిఇఓలకు ఎంఇఓలకు పాఠశాలల మేనేజిమెంటు పని అప్పగించబడింది. ఇది వారి పనికాదు. ఈ విధానాన్ని తొలగించి వెనుకటి పద్ధతి ప్రవేశపెట్టాలి. ప్రస్తుత విధానాన్ని సమూలంగా మార్పుచేసి పాఠశాలల నిర్వహణలోను ఉపాధ్యాయుల నియామకాలలోను వికేంద్రీకరణ విధానం అమలుచేయాలి. విద్యాశాఖలోని అధికారులను సర్వీసు కమిషను ద్వారా ఎన్నిక చేయాలి.

- వేదుల సత్యనారాయణ