తెలంగాణ

అది రోడ్డు ప్రమాదమే.. దేవిరెడ్డిది హత్య కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ఇంజనీరింగ్ విద్యార్థిని కె.దేవిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. దేవిరెడ్డిని హత్య చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆమె ప్రమాదంలో మృతి చెందిందని వైద్యులు కూడా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో కమిషనర్ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. టాస్క్ఫోర్సు డిసిపి లింబారెడ్డి, వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు, క్లూస్ టీమ్ ఇంచార్జి వెంకన్నలతో కలిసి సిపి విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, వాచ్‌మెన్ రాములు ఇచ్చిన సమాచారంతో హత్య కోణంలో విచారణ చేపట్టమాన్నారు. ఈ కేసు విచారణ కోసం మొత్తం ఆరు టీమ్‌లను ఏర్పాటు చేశామని అందులో టాస్క్ఫోర్సు డిసిపి పర్యవేక్షణలో మూడు టాస్క్ఫోర్సు, వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో మరో మూడు టీమ్‌లను ఏర్పాటు చేసి దేవిరెడ్డి స్నేహితుల కాల్ డేటాను సేకరించి, లైంగిక వేధింపుల కోణంలో విచారణ చేశామన్నారు. పబ్ ఈవెంట్‌కు భరతసింహారెడ్డి స్నేహితుడి వద్ద ఉచిత పాస్‌లుండటంతో అతడు తన స్నేహితులకు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో భరత్‌సింహారెడ్డి స్నేహితురాలు దేవిరెడ్డిని కూడా పబ్‌కు రావాలని ఆహ్వనించాడు. తన స్నేహితురాలు సోనాలితో కలిసి పబ్‌కు వెళ్తున్నానని తండ్రికి చెప్పటంతో ఆయన దేవిరెడ్డిని సోనాలి ఇంటి దగ్గర ఏప్రిల్ 30 సాయంత్రం డ్రాప్ చేసి వెళ్లాడు. భరత్‌సింహారెడ్డి అదే రోజు రాత్రి 9 గంటలకు సోనాలి, దేవిలను పికప్ చేసుకుని, రోడ్డు నెంబర్ 45వద్ద మరో స్నేహితుడు విశ్వనాథ్‌ను కలుపుకుని పబ్‌కు 10.30 గంటలకు చేరుకున్నారు. ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దేవిరెడ్డికి తల్లిదండ్రులు ఫోన్ చేయగా తనను సోనాలి ఇంటి వద్ద దించుతుందని చెప్పింది. పబ్ రెండున్నర గంటల ప్రాంతంలో మూసి వేశారు. తనతో వచ్చిన సోనాలి స్నేహితులతో వెళ్లిపోయింది. దీంతో భరత్-దేవిలు 3.32 గంటలకు కారులో దేవిరెడ్డి ఇంటికి బయలుదేరి 3.42 గంటలకు జర్నలిస్టు కాలనీ వద్దకు చేరుకున్నారు. 3.51 గంటలకు దేవిరెడ్డికి తండ్రి పోన్ చేశాడు. 3.58 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతరం పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని దేవిరెడ్డి తల్లితండ్రులకు సమాచారం అందించారు. దేవిరెడ్డిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమా దం జరిగిన సమయంలో భరత్‌సింహారెడ్డి మత్తులో కారు నడిపి, దేవి మృతికి కారకుడైనందుకు గాను అతడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, దేవిరెడ్డిని హత్య చేశారంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో పోలీసులు ఫోరెనిక్స్, మోటారు వాహనాల నిపుణులతో కలిసి చేసిన రెండవ విచారణలోనూ దేవిది హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. దేవి ప్రయాణించిన కారు ధ్వంసమైన తీరు, కారు ఎయిర్ బెలూన్ తెరుచుకున్నాక కూడా తలకు బలమైన గాయాలు తగలటం తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులతో క్షుణ్ణంగా విచారించి రోడ్డు ప్రమాదం వల్లే అలాంటి గాయాలు అవుతాయని ఫోరెనిక్స్ బృందం స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. దేవిరెడ్డి వెళ్లిన, వచ్చిన రూట్లలో దాదాపు 50 సీసీ కెమెరాల ఫుటేజ్‌లను కూడా విచారణ అధికారులు పరిశీలించారు. దేవికి సంబంధించిన ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ ఫోటోలు, మెసేజ్‌లను సైతం పోలీసులు పరిశీలించారు. ఫేస్‌బుక్ ద్వారా గత రెండు సంవత్సరాల నుంచి ఇద్దరికి పరిచయం ఏర్పడిందని తెలిపారు.

పోలీసు కమిషనరేట్‌లో ఆదివారం జరిగిన మీట్‌ది ప్రెస్‌లో
మాట్లాడుతున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి