ఆంధ్రప్రదేశ్‌

లేపాక్షి ఉత్సవాలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే లేపాక్షి ఉత్సవాలకు హాజరు కావాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం సచివాలయంలో తెలంగాణ మంత్రి చందులాల్‌ను కలిసి ఆహ్వానించారు. బాలకృష్ణ.. చందులాల్ చాంబర్‌కు వచ్చి ఆయనతో భేటీ అయ్యారు.
రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒకటేనని, ఆందుకే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే లేపాక్షి ఉత్సవాలకు పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. లేపాక్షిని అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈనెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ ఉత్సవానికి పలు రాష్ట్రాల మంత్రులు హాజరవుతారని తెలిపారు. చందులాల్ మాట్లాడుతూ బాలకృష్ణ స్వయంగా వచ్చి ఆహ్వానించడం సంతోషంగా ఉందని, లేపాక్షి ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు. లేపాక్షి ఉత్సవాలకు తనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా హాజరవుతారని చందులాల్ తెలిపారు.