తెలంగాణ

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అర్హుల జాబితా తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 13: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను రూపొందిస్తున్నామని, జాబితా పూర్తి కాగానే ఉద్యోగుల క్రమబద్ధీకరణ త్వరతగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా ముందుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు రిజర్వాయర్ సమీపంలో గల కల్వకుర్తి లిఫ్ట్-1ను పరిశీలించారు. అదేవిధంగా ఎల్లూరు రిజర్వాయర్ సమీపంలో కొనసాగుతున్న వాటర్‌గ్రిడ్ పథకం పనులను ఆయన పరిశీలించారు. కల్వకుర్తి లిప్ట్-2 జొన్నలబోగడ పనులను ఆయన పరిశీలించి సొరంగ మార్గంలో జరుగుతున్న పనులను కూడా పర్యవేక్షించారు. ఈ సం దర్భంగా కొల్లాపూర్‌లోని కెఎల్‌ఐ అతిధి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన జాబితాను సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. కమల్‌నాథన్ కమిటీ సూచనల మేరకు మార్చిలోగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ శాఖలకు సంబంధించి ఈ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదని, ఇంజనీర్లు సూచించిన మేరకే నిర్మాణం పనులు జరుగుతాయని అన్నారు. యావత్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలపై ఆసక్తి చూపిస్తున్నాయని, అందులో భాగంగా నే మిషన్ భగీరథ పథకం దేశంలోనే అత్యంత ప్రభావితం చేసిన పథకమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్, డబుల్‌బెడ్ రూం పథకాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో గు డుంబా, కల్తీసారాను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, పిడి యాక్ట్ కేసులు నమోదు చేశామని, దీంతో రాష్ట్రంలో గుడుంబా నియంత్రణ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన పలు నోటిఫికేషన్లు జారీ చేసిందని, ఉద్యోగాలలో పోలీస్‌శాఖలోనే అత్యధికంగా భర్తికానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
పనులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ