తెలంగాణ

సెయిల్ ప్రతినిధులతో సిఎస్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సెయిల్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెయిల్ కంపెనీలు బయ్యారంలో ఇనుప ఖనిజం లభ్యత, నాణ్యత, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై మార్చి నాటికి నివేదిక ఇస్తాయి. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం నాణ్యత దృష్ట్యా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని గతంలో సెయిల్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అయితే ఒక్క బయ్యారంలో మాత్రమే కాకుండా ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయని, ఈ జిల్లాల్లో లభించే ఇనుప ఖనిజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సెయిల్‌ను కోరింది. బయ్యారంలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశం పరిశీలించే అంశం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఉంది. ఇనుప ఖనిజం అనే్వషణ చేసే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తోంది. దాంతో సెయిల్ అధికారులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. చత్తీస్‌గఢ్‌లో లభించే ఇనుప ఖనిజాన్ని సైతం వినియోగించుకుని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సెయిల్‌ను కోరింది. ఇనుప ఖనిజం రవాణా కోసం చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి బయ్యారం వరకు కొత్త రైల్వే లైను ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.