తెలంగాణ

సెటిలర్లు! జర జాగ్రత్త..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ‘సెటిలర్లు జర జాగ్రత్త...మోసగాళ్ళు మీ వద్దకు వస్తున్నారు..’ అని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రేమ ఒలకబోస్తున్నదని ఆయన శుక్రవారం కోదండరెడ్డితో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. భీమవరం నుంచి పోటీ చేస్తానని తారక రామారావు ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగువారి రాష్ట్ర సమితిగా మారుస్తామన్న కెటిఆర్ మాటలను విశ్వసించరాదని ఆయన కోరారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు బృందంలో మీరు ఎందుకు లేరని ప్రశ్నించగా, గవర్నర్‌పై తనకు సదభిప్రాయం లేదని అందుకే వెళ్ళలేదని విహెచ్ చెప్పారు.