తెలంగాణ

చైతన్యానికి మారుపేరు తెలుగు మీడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలుగు మీడియాలో ఎక్కడా లేనంత చైతన్యం ఉందని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెన్నారు. ఇటీవల తాను ఉత్తరప్రదేశ్ వెళ్లి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపాక ఇద్దరం మీడియాతో మాట్లాడేందుకు వచ్చామని చెప్పారు. మన రాష్ట్రంలో మాదిరిగానే 50 కెమెరాలు వస్తాయేమో అనుకున్నానని, కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే కనిపించారని, ఇదేంటని అడిగితే ఇక్కడ అంతే అని అఖిలేశ్ యాదవ్ బదులిచ్చారని కెటిఆర్ తెలిపారు. మీడియా ప్రభుత్వాలు మంచి చేస్తే అభినందించాలని, తప్పు చేస్తే ప్రశ్నించాలని అన్నారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల పోర్టల్‌ను ఐటి మంత్రి కెటిఆర్ శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలో సైతం ఇతరుల కన్నా ముందుండాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రెస్ అకాడమీ తరఫున ఒక బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణలో కన్నా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం మంచి పథకాలు ఏమైనా అమలు చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కొత్త రాష్ట్రం కావడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని, జర్నలిస్టుల సంక్షేమంపై కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయితే మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రమాద బీమా పథకం పట్ల చిన్నచూపు చూడవద్దని, అందరూ నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,600 బస్ పాసులు జారీ చేశామని రవాణా శాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి తెలిపారు. ఎసి బస్సుల్లో ప్రయాణానికి అనుమతిపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
అక్రిడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు జారీ చేయనున్నట్టు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వరంగల్‌లో మాదిరిగా హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తున్నట్టు ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు మెసేజ్ వచ్చిన తరువాత తీతీతీ.్దఒ.ఆళ్ఘశఘశ్ఘ.్య్ప.జశ కి లాగిన్ అయి యూజర్ నేమ్ ఫాస్‌వర్డ్‌తో హెల్త్‌కార్డ్ పొందవచ్చునని తెలిపారు. సమావేశంలో కెవి రమణాచారి, ఎంపి బాల్క సుమన్, ఎంఎల్‌ఏ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల హెల్త్ కార్డులను విడుదల చేస్తున్న ఐటి శాఖ మంత్రి కెటిఆర్