తెలంగాణ

రూ 5.04 లక్షలు చెల్లిస్తారా.. సిఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోయినిపల్లి, జనవరి 8: కరీంనగర్ జిల్లా బోయనిపల్లి మండల పరిధి లోని మధ్యమానేరు నిర్వాసితులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి రూ.5.04 లక్షలు చెల్లిస్తారా? లేదా ముఖ్యమంత్రితో తాము మాట్లాడడానికి అపాయింట్‌మెంటు ఇప్పిస్తారా? అంటూ నిర్వాసితులు రోడ్డెక్కారు. కరీంనగర్-కామారెడ్డి ప్రధాన రహదారి కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం మధ్యమానేరు జలాశయ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న నిర్వాసిత కుటుంబాలు రాస్తారోకో నిర్వహించారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌లు కూస రవీందర్, పెద్ది నవీన్, ముంపు గ్రామాల ప్రతినిధులు పిల్లి కనుకయ్య, లింగంపల్లి శంకర్, రాజు ఆధ్వర్యంలో 500 మంది నిర్వాసితులు దాదాపు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ గత ఏడాది జూన్ 18న వేములవాడలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మధ్యమానేరు నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5.04 లక్షలు ప్రత్యేకంగా చెల్లిస్తామని ప్రకటించారన్నారు. అయతే, సిఎం ప్రకటించినా అధికారులు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ చెల్లించడం కుదరంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలిసినా అలాంటి చెల్లింపునకు ఎలాంటి జిఓ లేదని తేల్చి చెప్పారని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా రూ.5.04 లక్షల పరిహారమైనా చెల్లించండి, లేదా సిఎంను కలవడానికి తమకు అపాయింట్‌మెంటైనా ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీ, యువకులకు కుటుంబ పరిహారం చెల్లించాలని, వృద్ధులు, వితంతువులకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, భూనిర్వాసితుల రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయ.