తెలంగాణ

బెంగాల్ వేశ్యాగృహాలకు తరలిపోతున్న ఇద్దరు యువతుల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, జనవరి 8: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సదర్ హోం నుండి పరారైపోతున్న ఇద్దరు యువతులను రామగుండం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రైలుకోసం ఎదురు చూస్తున్న ఆ యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి వారిని తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన రాధాలాహోర్, ఒడిషాకు చెందిన గీతాంజలి నాయక్ రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఇద్దరినీ విచారించగా అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూశాయి. బెంగాల్‌లోని వేశ్యాగృహాలకు వెళ్లేందుకే కరీంనగర్ సదర్ హోం నుండి తప్పించుకు వచ్చినట్లు పేర్కొనడంతో పోలీసులు బిత్తరపోయారు. ఈ సంఘటనలకు సంబంధించి రైల్వే పోలీస్‌లు విచారించగా బయటపడ్డ అసలు విషయాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌కు చెందిన రాధాలాహోర్ అనే యువతి ఇటీవలే కరీంనగర్ సదర్‌హోంలో చేరింది. అక్కడినుండి వారం క్రితమే తప్పించుకుని పారిపోతూ రామగుండం రైల్వే స్టేషన్‌లో పోలీసులకు చిక్కగా ఈ యువతిని తిరిగి సదర్‌హోంకు తరలించారు. అయితే అక్కడ వారం రోజులకే సదర్‌హోంలోని మరో యువతి గీతాంజలి నాయక్‌ను మభ్యపెట్టి, బెంగాల్‌కు వెళ్దామని, అక్కడ తనకు తెలిసినవారు ఉన్నారని, వేశ్యాగృహాలకు వెళ్తే ఎంతో బాగా బతకవచ్చని నమ్మబలికి తన వెంట తీసుకువచ్చింది. బెంగాల్‌లో సుమారు 20 మందితో రాధాలాహోర్‌కు తెలిసిన వ్యక్తి ఒకరు వేశ్యాగృహాన్ని నడిపిస్తుండగా అక్కడికే గీతాంజలిని వెంటబెట్టుకొని వెళ్తున్నట్లు వెల్లడించడంతో అసలు విషయం బయటపడింది. గురువారం అర్ధరాత్రి కరీంనగర్ సదర్‌హోం నుండి పారిపోయి పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వీరు అక్కడ అనుమానాస్పదంగా రైల్వే పోలీసులకు కానరావడంతో రామగుండం జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆర్‌పిఎఫ్ ఎస్‌ఐ వెంకటస్వామి, జిఆర్‌పి హెచ్‌సి బషీరొద్దీన్ సమక్షంలో విచారించి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన చైల్డ్‌లైన్ 1098 అనే సంస్థకు చెందిన ప్రతినిదులు పి. రజిత, సిహెచ్ రామరాజుకు అప్పగించారు. ఇదిలాఉండగా సదర్‌హోం నుండి ఇద్దరు యువతులు పారిపోయి వచ్చినా కనీసం ఆ సభ్యులు ఎవరూ కూడా ఈ యువతులను తీసుకెళ్లడానికి రాలేదు.

తెలంగాణ భవన్‌ను తెలుగు భవన్‌గా మార్చండి

టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ భవన్ బోర్డును తెలుగు భవన్‌గా మార్చాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులను డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తానని మంత్రి కె. తారక రామారావు ప్రకటించడంపై రేవంత్‌రెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. మంత్రి కెటిఆర్ మాటలు పార్టీ విధానపరమైన నిర్ణయాలా? లేక వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని తమ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదని, మంత్రి కెటిఆర్‌కు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందని అన్నారు. మంత్రి కెటిఆర్ ఆంధ్ర వారిపై చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కెటిఆర్ వ్యాఖ్యలను మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంగా భావించాలా? అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్ చిన్నపిల్లాడని, తెలిసి తెలియక మాట్లాడారని ముఖ్యమంత్రి అంటారా? అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్‌లో వచ్చిన మార్పును స్వాగతిస్తున్నామని, ఆయన ఆంధ్రలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేయవచ్చని, అవసరమైతే బుడ్డీపేట నుంచి పోటీ చేసినా అభ్యంతరం లేదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు.