తెలంగాణ

హైదరాబాద్ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 8: హైదరాబాద్ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కెసిఆర్‌కు ఎక్కడిదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫక్తు రాజకీయాలు చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కెసిఆర్‌కు తగిన గుణపాఠం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన టిఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. భారతీయులంతా ఏ రాష్ట్రంలో, ఏ గ్రామాల్లోనైనా నివసించవచ్చని, కానీని టిఆర్‌ఎస్ మాత్రం అలాంటి వ్యవస్థను కాకుండా ఆ పార్టీ జెండా పట్టినవారే తెలంగాణలో ఉండాలనే ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వేల కోట్ల రుపాయలు కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని నాగం తెలిపారు. కేంద్రంపై బురదచల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు కాశన్న, రవి, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.