తెలంగాణ

అన్నిస్థాయిల్లో ఉచిత విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణలో అన్నిస్థాయిల్లో ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రూపొందించిన డైరీ, క్యాలండర్‌ను శుక్రవారం ఉప ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వేసవిలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల అంశాన్ని పరిష్కరిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. విద్యార్ధుల సేవలు, ప్రైవేటు కాలేజీల్లో సేవల్లో ఇకమీదట ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ చేస్తామన్నారు. అలాగే 3678మంది కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్ చేసేందుకూ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. విద్యావిధానంలో పెనుమార్పుల్లో భాగంగానే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలని నిర్ణయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య అందిస్తామన్నారు. సాంకేతిక విద్యాసంస్థల్లో నెలకొన్న లోపాలను కూడా సరిదిద్దుతామన్నారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఉచిత విద్య అందిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 1190 గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ల సంఘం నాయకుడు మధుసూధనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కమిషనర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధుల నుంచి

టీచర్లకు మినహాయింపు?

హైదరాబాద్, జనవరి 8: రాష్ట్రాల్లో ఏదో ఒకరకమైన ఎన్నికలు రావడం, వాటిలో టీచర్లను మమేకం చేయడంతో విద్యాపాలన కొరవడుతోంది. ఎన్నికల వంటి భారీ వ్యవహారాలను పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమవుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ మిగిలిన శాఖల సిబ్బందితో పోల్చుకుంటే విద్యాశాఖలోనే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. దాంతో సగం ఇబ్బందులను అధిగమించేందుకు ఏ రకమైన పని ఉన్నా టీచర్ల సేవలను ఉపయోగించుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. చివరికి సర్వేలు, జనన మరణ నివేదికలు, ఆధార్ నివేదికలు వంటి ఇతర శాఖల పనులను కూడా విద్యాశాఖకు చెందిన వారికే అప్పగించడం షరా మామూలైపోయింది. టీచర్లు అయితే వివరాల నమోదు కూడా సరిగా చేస్తారని, అవగాహన ఎక్కువ ఉంటుంది కనుక ఏ పని అయినా సవ్యంగా పూర్తవుతుందనే ఆలోచన కూడా కావచ్చు. మొత్తం మీద ఏం జరిగినా టీచర్ల సేవలు అవసరమవుతున్నాయి. ఒక నెల రోజుల పాటు అంతర్గత పరీక్షలకు, మరో 15 రోజులు శిక్షణకు, ఇంకో నెల రోజులు ఇతర పనులకు టీచర్లు తమ కాలాన్ని వినియోగించాల్సి వస్తోంది. దీంతో రెండు నుండి మూడు నెలల పాటు విద్యాత్మక అంశాలకు టీచర్లు దూరం అవుతున్నారు. వీటికి తోడు బదిలీలు, క్రమబద్ధీకరణ కార్యక్రమాల్లో కూడా వారు బిజీగా ఉండటంతో తరగతి గది పనులు ఇబ్బంది అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల విధుల నుండి ఉపాధ్యాయులను తప్పించాలని కేంద్రం సీరియస్‌గా ఆలోచిస్తోంది.
విద్యతో సంబంధం లేని ఎన్నికల విధులు, జనాభా లెక్కల సేకరణ వంటి పనుల నుండి ఉపాధ్యాయులను విముక్తుల్ని చేయాలని కొన్ని దశాబ్దాలుగా టీచర్లు కోరుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు కేంద్రం సీరియస్‌గా ఆలోచిస్తోందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంపై టీచర్లు దృష్టి సారించేలా కేంద్రం చర్యలు చేపడుతోందని అన్నారు. గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం కొన్ని సూచనలు చేసిందని, అయితే టీచర్లకు బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు.