తెలంగాణ

జూలైలో పాలమూరు నుంచి సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8:పాలమూరు జిల్లాలో ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటి నుంచి జూలై నాటికి సాగునీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భూ సేకరణ సమస్యలపై హరీశ్‌రావు శుక్రవారం సమీక్ష జరిపారు. నాలుగు ప్రాజెక్టుల్లో సేకరించాల్సిన భూమి 3550 ఎకరాలు కాగా, దీనిలో కల్వకుర్తి ప్రాజెక్టులో 1750 ఎకరాలు, నెట్టెంపాడులో 1390 ఎకరాలు సేకరించాలి. చిన్న బిట్లుగా మిగిలిపోయిన భూమిని సేకరించాల్సిన అవసరాన్ని గుర్తించాలని మంత్రి సూచించారు. చిన్న పాటి అలసత్వం వల్ల వేల ఎకరాలకు నీరందించలేకపోతామని అన్నారు. జూలై నాటికి అన్ని ప్రాజెక్టుల్లో సాగునీరు అందించి తీరాలని అన్నారు. కొయిల్ సాగర్‌లో మిగిలిన 35 ఎకరాల భూ సేకరణ ఈనెల 25 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బీమా ప్రాజెక్టులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కొయిల్ సాగర్ ప్రాజెక్టులో నాలుగు పంపులు పని చేయడం ప్రారంభమైనా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆశించిన ఫలితాలు అందడం లేదని మంత్రి తెలిపారు. వచ్చే ఖరీఫ్ కాలానికి నీరందించాలంటే భూ సేకరణ నెలాఖరుకు పూర్తి చేయాలని అన్నారు. కోర్టు కేసులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఇలు ప్రభుత్వ న్యాయవాదులతో అవసరమైతే అడ్వకేట్ జనరల్‌తో సంప్రదిం కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాజెక్టులను సమీక్షించేందుకు ప్రతి ప్రాజెక్టుకు జూన్ వరకు నెల వారి ప్రొగ్రేస్ కార్డు, జాబ్ చార్ట్ తయారు చేయాలని అన్నారు. వీటి ఆధారంగానే తదుపరి సమీక్షలు ఉంటాయని అన్నారు. ఇసుక అందుబాటులో ఉండడం లేదని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో 99,100,105 ప్యాకేజీ పనులకే 25వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని తెలిపారు. కాంట్రాక్టర్లకు అవసరమైన ఇసుక దగ్గరలోని క్వారీల నుంచి, జప్తు చేసిన ఇసుకను అందుబాటులో ఉంచాలని మంత్రి జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
12న ముంబయకి
తుమ్మడి హట్టి మేడిగడ్డ బ్యారేజీలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇంజనీర్ల స్థాయిలో చర్చలు జరిగిన తరువాత తదుపరి చర్చలకు ఈనెల 12న తాను ముంభై వెళుతున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. ప్రాణహిత బ్యారేజీపై స్పష్టమైన అవగాహనకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.