తెలంగాణ

శబరిమలలో తెలంగాణ భవన్‌కు ఐదెకరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: కేరళ రాష్ట్రంలోని శబరిమలకు తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం నిర్మించబోయే వసతి సముదాయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేరళ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంపై పంబానదీ తీరంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో కేరళ భవన్‌కు స్థలాన్ని కేటాయించిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు దేవాదాయశాఖ కమిషనర్ ఎన్ శివశంకర్‌తో కలిసి బుధవారం ఉదయం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శబరిమలకు వెళ్లారు.
ఈ సందర్భంగా పంబానదికి సమీపంలోని నీలక్కల్ వద్ద కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని మంత్రితోపాటు వెళ్లిన బృందం పరిశీలించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు.
తెలంగాణకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో పార్కింగ్, క్యాంటీన్, డార్మెటరీ, స్నానాల గదులను నిర్మించనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అలాగే శబరిమలలో తెలుగు మాట్లాడే భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సానుకూలంగా స్పందించినట్టు మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రితో పాటు వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం సన్నిధానంలో అయ్యప్పస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

శబరిమలలో పంపానది తీరంలో బుధవారం జరిగిన
కార్యక్రమంలో పాల్గొన్న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ,
తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు