తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న భూభాగంలో గల ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించిన దరిమిలా ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఫోన్‌లో సూచించారు. దీంతో హైదరాబాద్ సహ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు భారీగా మోహరించారు.
ప్రధాన రైల్వే స్టేషన్లు సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కాజీపేట్, కాకినాడ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా దాడులకు పాల్పడవచ్చన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతను పెంచినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో భద్రత చర్యలు చేపట్టారు.
జాతీయ రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనుమానితులపై నిఘా వేసి ఉంచారు. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలతోపాటు పోలీస్ హెడ్‌క్వార్టర్స్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పటిష్ఠ భద్రతకు చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్రాల డిజిపిలు పోలీస్ అధికారులను ఆదేశించారు.