ఆంధ్రప్రదేశ్‌

మానవీయ కోణమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: స్మార్ట్ సిటీల నిర్మాణంలో మానవీయ కోణానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని బ్రిక్స్ దేశాల సదస్సు పిలుపునిచ్చింది. సామాజిక వెలికి స్వస్తి పలికి సమీకృత అభివృద్ధే స్మార్ట్ సిటీల లక్ష్యం కావాలని పేర్కొంది. ఇందుకు టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తున్నప్పటికీ అదే సామాజిక లక్ష్య సాధనంకు అంతిమం కాదని బ్రిక్స్ దేశాలకు చెందిన పట్టణీకరణ నిపుణులు స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి టెక్నాలజీ ఓ సాధనం మాత్రమేనని ఉద్ఘాటించారు.
శరవేగంతో జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో వౌలక సదుపాయాల కల్పన పెద్ద సవాలుగా మారుతోందని వివిధ సభ్య దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. వౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక చేయూత అంశంపై గురువారం కీలక చర్చ జరిగింది. చైనా కనస్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ చీఫ్ ఇంజనీర్ జూ హూయన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణీకరణకు ప్రధానంగా బ్యాంకులపై ఆధారపడటం జరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వనరుల సమీకరణకు బ్యాంకులనే కాకుండా ఇతర సంస్థల వైపు దృష్టిసారిస్తున్నామన్నారు. చైనా పట్టణాలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలు 2014 నాటికి 438.3 బిలియన్ యువాన్లుగా తెలిపారు. మొత్తం రుణంలో ఇది 27.3 శాతంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ప్రత్యేక ఆర్థిక బాండ్లను విడుదల చేస్తూ నిధులు సమకూర్చుకోవాలన్నారు. అలాగే ఆర్థిక భారం పెరగకుండా నిర్మాణాల్లో బిఓటి విధానాన్ని అవలంభిస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. దక్షిణాఫ్రికా కేప్‌టౌన్ పురపాలక సంఘం మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఫిలిప్ వాన్ రెనెవెల్డ్ మాట్లాడుతూ పట్టణాల ఆర్థిక అవసరాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. స్థానిక సంస్థలకు రుణాలు ఇవ్వడంతో పాటు వౌలిక సదుపాయాలకు పెట్టుబడిగా వాటిని వినియోగించడం, దాని నుంచి ఆర్థిక వృద్ధి సాధించడం జరుగుతోందన్నారు. పారిశుద్ధ్యం, అనుఉత్పాదక రంగాలు సమస్యాత్మకంగా మారాయని, ప్రజాస్వామ్య పద్ధతిలో బలోపేతమైన వ్యవస్థలను నెలకొల్పాలన్నారు. ఆస్తి పన్ను, జాతీయ ఇంథన పన్నులో భాగం కల్పించడం ద్వారా కూడా ఆయా సంస్థలను ఆదుకుంటున్నామన్నారు. బాధ్యత, వృత్తి నిపుణత కలిగిన పరిపాలన, పారదర్శక పాలన ముఖ్యాంశాలుగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు. తమ దేశంలోని పట్టణ సంస్థలు 45 శాతం నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా పొందుతున్నాయని తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ డైరెక్టర్‌ఖ రజత్ కతూరియా మాట్లాడుతూ 2031 నాటికి భారతదేశంలో అనేక పట్టణాలు నగరాలుగా ఆవిర్భవిస్తాయన్నారు. 1990 నుంచి 2000 సంవత్సరం వరకూ ఇరత దేశాలతో పోలిస్తే భారత్‌లో పట్టణీకరణ చాలా తక్కువగా జరిగిందన్నారు. పట్టణీకరణ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సేవా రంగం ప్రగతి సాధిస్తుందన్నారు. స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలని, ఇక్కడ ప్రజలకు మంచి సేవలందించడం ద్వారా అర్ధ ట్రిలియన్ డాలర్లు పొదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. సత్ఫలితాలిచ్చే విధంగా వనరులను సద్వినియోగం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని, అందుకు సూరత్, పూణే పట్టణాలే ఉదాహరణగా పేర్కొన్నారు. క్రిసిల్ రిస్క్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ డైరెక్టర్ బ్రిజ్ గోపాల్ మాట్లాడుతూ దేశంలో 100 పెద్ద నగరాలు 16 శాతం జనాభాతో 42 శాతం తలసరి ఆదాయాన్ని అందిస్తున్నాయన్నారు. స్థానిక ప్రభుత్వాలు 40 నుంచి 50 శాతం వరకూ ప్రభుత్వ గ్రాంట్లపై ఆధారపడుతున్నాయని, వీటిలో 50 శాతం ఉద్యోగుల జీత,్భత్యాలకే సరిపోతోందన్నారు. పిపిపి విధానం ద్వారా స్థానిక సంస్థలు ఆర్థికంగా పుంజుకుంటాయన్నారు.