తెలంగాణ

ఆచితూచి అభ్యర్థుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో గ్రేటర్ హైదరాబాద్ టిడిపి నాయకులు సమావేశమై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, ఇతర పార్టీ నేతలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మిత్రపక్షమైన బిజెపితో కలిసి పోటీ చేయాలని అన్నారు. బిజెపితో సీట్ల సర్దుబాటు విషయంలో పొరపొచ్చాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. అధికార పార్టీ తప్పకుండా ప్రలోభాలు పెడుతుంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికే టిక్కెట్లు ఇద్దామని, ఎవరో చెప్పారని, సిఫార్సులు వచ్చాయని టిక్కెట్ ఇస్తే చివరి నిమిషంలో అభ్యర్థులు పార్టీ పుట్టి ముంచుతారని ఆయన హెచ్చరికగా అన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని, తాను హైదరాబాద్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్యులతో పరిస్థితులను సమీక్షిస్తుంటానని లోకేష్ వారికి చెప్పారు.