తెలంగాణ

బిసిల్లో క్రీమీలేయర్‌కు నిరసనగా 30న దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: వెనుకబడిన తరగతులకు ఉద్యోగ నియామకాల్లో సంపన్నశ్రేణి వర్తిం ప చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 30న హైదరాబాద్‌లో నిరహార దీక్ష చేయనున్నట్టు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను ఉధ్ధతృం చేయనున్నట్టు ఆయన హెచ్చరించారు. బిసిలకు సంపన్నశ్రేణి వర్తింప చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై బుధవారం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి నుంచి బిసిలను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. స్వయం పాలన పేరిట అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం బిసిలను రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
బిసిలను రాజకీయంగా అణచివేయడమే కాకుండా, వారికి ఉద్యోగ నియామకాల్లో కూడా అన్యాయం చేయడానికే సంపన్నశ్రేణిని అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆయన విమర్శించారు. బిసిలకు అన్యాయం జరిగిందని ఒకవైపు ఆందోళన చెందుతుంటే, అగ్నిమీద ఆజ్యం పోసినట్టు హిజ్రాలను కూడా బిసిల జాబితాలో చేర్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ బిసి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నట్టు కృష్ణయ్య హెచ్చరించారు. బిసి సంపన్నశ్రేణి వర్తింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా మేధావి వర్గాలు, ప్రజాస్వామికవాదులు గళం ఎత్తాలని ఆయన పిలుపునిచ్చారు.

క్రీమిలేయర్‌కు మేము వ్యతిరేకం
బిజెపి నేత లక్ష్మణ్

హైదరాబాద్, డిసెంబర్ 23: మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు విమర్శలు చేస్తున్నారని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రేమ లేదని మంత్రి కెటిఆర్ అనడంలో వాస్తవం లేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నదని ఆయన అన్నారు. మంత్రి కెటిఆర్ తప్పుడు ప్రచారం చేసుతన్నారని ఆయన విమర్శించారు. మంత్రి కెటిఆర్‌కు ప్రధానిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. బిసిల క్రిమిలేయర్‌కు తాము వ్యతిరేకమని ఆయన తెలిపారు. క్రిమిలేయర్‌కు వ్యతిరేకంగా బిసి సంఘాలు చేసే ఉద్యమానికి తాము మద్ధతునిస్తామని ఆయన చెప్పారు. బిసి సంక్షేమానికి ఇంత వరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంసి పరిథిలో రంగుల హోర్డింగ్‌లు పెట్టడంతో ఎన్నికల్లో విజయం సాధించరని ఆయన టిఆర్‌ఎస్‌నుద్ధేశించి అన్నారు.

అగ్ని ప్రమాద నివారణ చర్యలు తప్పనిసరి
31లోగా ఫైర్ ఎన్‌ఓసి తీసుకోవాలి

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్టవ్య్రాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల యజమానులు, అపార్టుమెంట్ల యజమానులు ఈ నెల 31వ తేదీలోగా ఫైర్ ఎన్‌ఓసి తీసుకోవాలని, దరఖాస్తు ఫారాలు ఇ-సేవా కార్యాలయాల్లో లభిస్తాయని తెలంగాణ అగ్నిమాపక సర్వీసుల డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. నివాస అపార్టుమెంట్లు 18మీటర్ల ఎత్తు, స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు 15మీటర్లు ఆపై ఎత్తు కలిగివుంటే విధిగా ఫైర్ ఎన్‌ఓసి తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. జంటనగరాల్లో 15మీటర్ల లోపు 500 చ.గ.విస్తీర్ణం కలిగివున్న భవన సముదాయం, వాణిజ్య సముదాయాలు కూడా ఎన్‌ఓసి తీసుకోవాల్సి ఉంటుందని, అదేవిధంగా జిల్లాల్లో 6మీటర్ల ఎత్తుకలిగిన అపార్టుమెంట్లు, దుకాణ సముదాయాలు, ఫంక్షన్ హాళ్లు కూడా ఆయా జిల్లా కేంద్రాల్లోని అగ్నిమాపక సర్వీసు కేంద్రాల్లో ఎన్‌ఓసి తీసుకోవాలని సూచించారు.