తెలంగాణ

సుల్తానాబాద్‌లో సైకో వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, డిసెంబర్ 23: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్ర్తినగర్ వద్ద బుధవారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శాస్ర్తినగర్‌లోని అంజయ్య అనే రైతు కనిపించిన వారిపై రాళ్లతో దాడి చేయడం, రాజీవ్ రహదారిపై అడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. కనబడిన వ్యక్తులను కొడుతూ గాయపర్చాడు.
పలువురి ఇళ్లల్లోకి వెళ్లి వస్తువులను, సామాన్లను ధ్వంసం చేశాడు. దుకాణాల లోపలికి వెళ్లి సరుకులను చిందరవందర చేశాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టివేసి పోలీసులకు సమాచారం అందించారు. బంధువులు అంజయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, కరీంనగర్‌లో సాఫ్టవేర్ ఇంజనీర్ సృష్టించిన భయానక సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే ఇక్కడ సైకో వీరంగం సృష్టించడంతో భయం నెలకొంది.