తెలంగాణ

మహారాజులు చేయలేని పని ఇది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: మహమహా రాజులు కూడా చేయలేని బృహత్కార్యాన్ని ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తలకెత్తుకున్న అయుత మహా చండీయాగ సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలని శృంగేరి పిఠాధిపతి, జగద్గురు భారతీ తీర్థ స్వామి ఆశీర్వదించారు. అయుత చండీయాగం విజయవంతం కావాలని ఆశీర్వదిస్తూ శృంగేరి పిఠాధిపతి భారతీతీర్థ స్వామి ముఖ్యమంత్రికి సందేశాన్ని పంపించారు. యాగశాలలో శృంగేరి నుంచి వచ్చిన రుత్వికులు భారతీ తీర్థ స్వామి ఆశీర్వచనాలను చదివి వినిపించారు. లోక కళ్యాణార్థం చండీయాగాన్ని తలపెట్టడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని, అసురులను సంహరించిన లోకమాత చండీదేవి అనుగ్రహంతో యాగం ఫలప్రదం అవుతుందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని తన సందేశంలో పేర్కొన్నారు. యాగ నిర్వహణను స్వయంగా పర్యవేక్షించడానికి శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చిన ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీ శంకర్ ఈ సందర్భంగా జగద్గురు ఆశీస్సులను అందజేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రుత్వికులతో యాగశాల ‘మినీ ఇండియా’గా గోచరిస్తోందని ఆయన కొనియాడారు. రెండు వందల ఏళ్లుగా చరిత్రలో ఏ చక్రవర్తిగానీ, పాలకుడుకానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమాన్ని కోరి యాగం చేసిన దాఖలాలు లేవని గౌరీ శంకర్ అన్నారు. మహా భారతంలో చెప్పినట్టుగా ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి జరిగినట్టే, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న యాగానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి అద్భుత ప్రపంచాన్ని సృష్టించారని ఆయన కొనియాడారు. ఈ యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సంతనానికి ఇబ్బంది కలిగితే తల్లి అనుగ్రహించినట్టుగానే, ప్రజల బాగోగుల కోసం పాలకులు చండీ మాతను ఆశ్రయించారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చండీయాగం చేస్తున్నది కూడా తల్లి అనుగ్రహం కోసమేనని గౌరీ శంకర్ అన్నారు. నాలుగేళ్ల క్రితం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి నిర్వహించిన పద్ధతిలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా యాగం చేస్తున్నారని ఆయన అభినందించారు.