తెలంగాణ

నరుూం అనుచరుడు పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాల్లో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత అతని అక్రమ వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. భూ అక్రమ దందా, సెటిల్‌మెంట్లు, కిడ్నాప్, బెదిరింపులు, హత్యలు ఎనె్నన్నో వ్యవహారాలపై సిట్ అధికారులు చేపట్టిన విచారణ రెండు వారాలుగా కొనసాగుతోంది. తాజాగా ఆదివారం వనస్థలిపురంలోని నరుూం అనుచరుడు సంజీవరెడ్డి ఇంటిని సిట్ అధికారులు చుట్టుముట్టారు. పోలీసులు వస్తున్నారనే సమాచారం అందుకున్న సంజీవరెడ్డి పారిపోయాడు. సంజీవరెడ్డి రియల్టర్, నరుూం అనుచరుల్లో ఒకడైన సంజీవరెడ్డి నగర శివారులోని ఆదిభట్ట, తుక్కుగూడలో రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని బాధితుల ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. నరుూం అనుచరులతో సంజీవరెడ్డి తుక్కుగూడలో రైతులను బెదిరించి దాదాపు 38 ఎకరాలు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫిర్యాదులు వచ్చినట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. ఆదిభట్లలో దాదాపు 48 ఎకరాలు నరుూం అనుచరుల ఆధీనంలో ఉన్నట్టు సిట్ అధికారులకు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఆదిభట్లలో నరుూం అనుచరులు సామ సంజీవరెడ్డితో కలసి ఓ పెద్ద ఏసి ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిట్ అధికారులు వనస్థలిపురంలోని సామ సంజీవరెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లగా, అప్పటికే సంజీవరెడ్డి పారిపోయాడు. సంజీవరెడ్డి తల్లిదండ్రులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సామ సంజీవరెడ్డి అరెస్టయితే నరుూం అక్రమాలకు చెందిన మరింత సమాచారం లభించే అవకాశం ఉన్నట్టు ఓ సీనియర్ సిట్ అధికారి తెలిపారు.