ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా 9 అర్బన్ మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 7: రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 9 అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఆదివారం డిప్యూటీ సిఎం కెఇ తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా ప్రజా సమస్యల పరిష్కార సమయం గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే గతంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అవినీతి చాలా వరకూ తగ్గిందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజాభిమానం చూరగొనడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి దేశంలో ఎక్కడా లేని విధంగా సమస్యలు లేని రెవెన్యూ శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీశైలంలో నిర్మించిన పుష్కర ఘాట్లను ఆదివారం డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తనిఖీ చేశారు. లింగాలగట్టు, పాతాళగంగ ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్‌కు సూచించారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ డిప్యూటీ సిఎం కెఇకి వివరించారు. అంతకుముందు కెఇ కృష్ణమూర్తి శ్రీ భ్రమరాంబికామల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఇఓ నారాయణ భరత్‌గుప్త, ఆలయ వేద పండితులు కెఇకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. కెఇ వెంట ఎస్పీ రవికృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.

శ్రీశైలంలో కృష్ణా పుష్కర ఘాట్ పనులను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, కలెక్టర్ విజయమోహన్ తదితరులు

కోనేరుకు కన్నీటి వీడ్కోలు

కొత్తగూడెం టౌన్, ఆగస్టు 7: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు నాగేశ్వరరావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం, పెనగడపలోని కోనేరు వ్యవసాయక్షేత్రంలో కుమారుల చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్ కోనేరు స్వగృహంలో ఆయన భౌతికకాయంపై జాతీయజెండాను కప్పారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ దివ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎపి ఎక్సైజ్ మంత్రి కోనేరు భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కోనేరు అభిమానులు పాల్గొన్నారు. ప్రత్యేక వాహనం ద్వారా వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. కార్యక్రమంలో కొత్తగూడెం, సత్తుపల్లి శాసన సభ్యులు జలగం వెంకటరావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యదర్శులు సీతక్క, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కోనేరు భౌతికకాయంపై పూలమాల ఉంచి నివాళులర్పిస్తున్న
ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ దివ్య