ఆంధ్రప్రదేశ్‌

మంగళగిరిలో ఎయిమ్స్.. తిరుపతిలో ఐఐటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న 18 జాతీయ విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోద ముద్ర వేయడంతో పాటు నిధులను సైతం విడుదల చేసింది. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు 500 కోట్లు కేటాయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే ఎయిమ్స్, ఐఐటిలకు నిధులు సమకూరి, ఆ సంస్థల ఏర్పాటు వేగవంతం అవుతుందని చెబుతున్నారు. దేశంలో 2014-15 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా ఐదు ఐఐటిలు, నాలుగు ఎయిమ్స్ సంస్థలు, 2015-16లో ఏడు ఎయిమ్స్ సంస్థలు, ఒక ఐఐటి, ఒక ఐఐటి ఐఎస్‌ఎం సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ఎయిమ్స్ సంస్థలను కళ్యాణి (పశ్చిమబెంగాల్), మంగళగిరి (ఎపి), నాగ్‌పూర్ (మహారాష్ట్ర), పూర్వాంచల్ (యుపి), భటిండా(పంజాబ్), గౌహతి( అస్సాం), బీహార్, జమ్మూ, కాశ్మీర్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటిలు తిరుపతి, పలక్కాడ్(కేరళ), జమ్మూ, బిలాయ్(్ఛత్తీస్‌ఘడ్), గోవా, ధర్వాడ్, ఐఎస్‌ఎం ధన్‌బాద్ (జార్ఖాండ్) లలో ఏర్పాటు చేస్తున్నారు.

మోదీ సభకు చురుగ్గా ఏర్పాట్లు

ఎల్‌బి స్టేడియంను పరిశీలించిన బిజెపి నేతలు

హైదరాబాద్, ఆగస్టు 5: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు బిజెపి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7న మోదీ తెలంగాణ రాష్ట్రానికి మొదటి సారి వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకు ప్రధాని పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇటీవల ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని తెలంగాణకు వస్తున్నందున పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి కార్యాలయం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఈ మేరకు 7న సాయంత్రం ఎల్.బి. స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి ఐదుగురు చొప్పున కార్యకర్తలు బహిరంగ సభకు వచ్చే విధంగా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ బహిరంగ సభ విజయంవంతం అయ్యేందుకు పార్టీ ఎమ్మెల్యే చింతల నేతృత్వంలో గురువారం యాగం నిర్వహించారు. శుక్రవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు బహిరంగ సభ నిర్వహించే ఎల్.బి. స్టేడియంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.