ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వాల్సిందే: ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల మనోభావాలు దెబ్బతినకముందే ప్రత్యేక హోదా కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చానంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముద్దుకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుత్తూరులో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వీధులు ఊడ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి గాలి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిందన్నారు. అయితే నాడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారన్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగా నిర్ణయించకపోవడం సరికాదన్నారు. ప్రజలు ఆగ్రహానికి లోనై ఉద్యమాల వైపు నడవక ముందే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేంద్రంతో సత్సంబంధాలు అవసరమేనన్నారు.
అలా అని రాష్ట్రానికి రావాల్సిన హక్కులను ఎవరూ వదులుకోలేరన్నారు. అందుకే తాము శాంతియుతంతగా నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తాము బిజెపికి దూరం కాబోమన్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు అనేక పర్యాయాలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని కోరారన్నారు. కేంద్రంలోని బిజెపి కూడా రాష్ట్రంలో టిడిపి పరిస్థితిని కూడా అర్థం చేసుకొని స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.